Jagan RRR dispute : జాతీయ వివాదంగా జగన్ ట్వీట్, RRR అభినందన రగడ
త్రిబుల్ ఆర్ గ్లోబల్ అవార్డుపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు
- By CS Rao Published Date - 04:25 PM, Wed - 11 January 23

త్రిబుల్ ఆర్ సినిమాకు వచ్చిన గ్లోబల్ అవార్డుపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు జాతీయ స్థాయిలో వివాదం( Jagan RRR dispute) అయింది. అయన అభినందనలు తెలుపుతూ తెలుగు జెండా(Flag) రెపరెపలాడుతుందని చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఈ అవార్డు తెలుగు వారికి గర్వకారణమని, ప్రపంచ వేదికపై తెలుగు జెండా రెపరెపలాడుతుందని ముఖ్యమంత్రి పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో కొనియాడారు. అయితే, ముఖ్యమంత్రి శుభాకాంక్షల సందేశం ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీకి మింగుడుపడలేదు. సోషల్ మీడియా ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. దేశభక్తి గీతాలకు, భారతదేశంపై ఉన్న ప్రేమకు పేరుగాంచిన సమీ, ముందుగా మనం భారతీయులమని, ముఖ్యమంత్రి అనుసరిస్తున్న వేర్పాటువాద వైఖరి అనారోగ్యకరమని ( Jagan RRR dispute) చురకలు వేశారు.
జాతీయ స్థాయిలో వివాదం( Jagan in dispute)
వాస్తవంగా భారతీయ సినిమాకు ఇది గొప్ప రోజు. టీమ్ RRR గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్ 2023లో పెద్ద విజయం సాధించి దేశం గర్వించేలా చేసింది. SS రాజమౌళి దర్శకత్వం వహించిన నాటు నాటు కోసం ఉత్తమ పాట- చలన చిత్రంగా అవార్డును గెలుచుకుంది. ఈ పాటను జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై చిత్రీకరించిన విషయం విదితమే. ట్విట్టర్ వేదికగా టీమ్ RRR పెద్ద విజయాన్ని జరుపుకుంది. ఈ పాటను ఎం. ఎం. కీరవాణి ఆలపించారు. అధికారిక ప్రకటన తర్వాత, పలువురు ప్రముఖులు ఈ భారీ ఫీట్‌పై SS రాజమౌళి, అతని బృందానికి అభినందనలు తెలిపారు. RRR నటుడు ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్ నాటు నాటు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డ్స్‌లో పెద్దగా గెలుపొందడంపై స్పందించారు. అతను RRR లో ఎడ్వర్డ్ అనే బ్రిటిష్ అధికారి పాత్రను పోషించాడు.
The #Telugu flag is flying high! On behalf of all of #AndhraPradesh, I congratulate @mmkeeravaani, @ssrajamouli, @tarak9999, @AlwaysRamCharan and the entire team of @RRRMovie. We are incredibly proud of you! #GoldenGlobes2023 https://t.co/C5f9TogmSY
— YS Jagan Mohan Reddy (@ysjagan) January 11, 2023
Also Read : Golden Globe Awards : గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో మెరిసిన జూ.ఎన్టీఆర్ రామ్ చరణ్
“ఎం.ఎం. కీరవాణి గారు మరియు మా టీమ్ మొత్తానికి నేను సంతోషిస్తున్నాను. నేను చాలా కాలంగా MM క్రీమ్ సర్ అభిమానిని. నాటు నాటు దశాబ్దాలుగా ఆయన మనకు అందించిన లెక్కలేనన్ని రత్నాలలో ఒకటి అని హాలీవుడ్‌కు మాత్రమే తెలిస్తే, మనసులు ఎగిరిపోతాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను, ”అని అన్నారు. ఈరోజు జరిగిన వేడుకకు SS రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మరియు M.M కీరవాణి హాజరయ్యారు. సినిమాకు అవార్డు రావడంతో వారి ఆనందానికి అవధులు లేవు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అలియా భట్, శ్రియా శరణ్ మరియు అజయ్ దేవగన్ కూడా ఉన్నారు. ఇది మార్చి 25, 2022న విడుదలై విజయం సాధించింది. ఇప్పుడు గ్లోబల్ అవార్డులను గెలుచుకుంది.
జాతీయ జెండా బదులుగా తెలుగు జెండా
గ్లోబల్ అవార్డులను కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయంగా చూడడాన్ని జాతీయ మీడియా సైతం విమర్శిస్తోంది. విభజన వాదాన్ని వినిపిస్తున్నారని జాతీయతావాదులు మండిపడుతున్నారు. గ్లోబల్ అవార్డులను అందుకున్న సినిమాకు అభినందనలు ఎలా తెలపాలో తెలియని సీఎంగా జాతీయ మీడియా ఆయన్ను ఆడుకుంటోంది. జాతీయ జెండా(Flag) బదులుగా తెలుగు జెండా అంటూ ఆయన ట్వీట్ లో సంభోందించిన అంశాన్ని తప్పుబడుతోంది.
Also Read : RRR At Oscars: ‘ఆర్ఆర్ఆర్’ కు ఆస్కార్.. ‘ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్’గా నామినేట్!