Jagan Punganuru : 30ఏళ్ల పాటు సీఎం కల ఫలితం `పుంగనూరు` ఎపిసోడ్ ?
చిత్తూరు జిల్లా పుంగనూరులో (Jagan Punganuru)ఏమి జరిగింది? ఎవరిది తప్పు? ఎందుకు హై టెన్షన్ వాతావరణం నెలకొంది?
- Author : CS Rao
Date : 05-08-2023 - 12:24 IST
Published By : Hashtagu Telugu Desk
చిత్తూరు జిల్లా పుంగనూరులో (Jagan Punganuru)ఏమి జరిగింది? ఎవరిది తప్పు? ఎందుకు హై టెన్షన్ వాతావరణం నెలకొంది? లా అండ్ కంట్రోల్ ఏపీలో కంట్రోలు తప్పిందా? అనే ప్రశ్నలు వేసుకుంటే, ఇదే తరహా పరిస్థితులు మరింత ముదిరే అవకాశం ఎన్నికల నాటికి ఉంటుందని సర్వత్రా వినిపిస్తోంది. మరో 30 ఏళ్ల పాటు తానే సీఎం అంటూ చెబుతోన్న జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా కడప తరహా పాలిటిక్స్ ను పరిచయం చేస్తున్నారని పుంగనూరు ఘటన చూసిన తరువాత ఎవరైనా భావిస్తారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏమి జరిగింది?(Jagan Punganuru)
సాధారణంగా విపక్షాలు మీటింగ్ పెట్టుకుంటే అధికారపక్షం భద్రత కల్పించాలి. లా అండ్ ఆర్డర్ కు భంగం కలుగకుండా నడుచుకోవాలి. తద్భిన్నంగా అధికారపక్షంకు చెందిన శ్రేణులు రోడ్డు మీదకు రావడం పరిపాటిగా మారింది. ప్రాజెక్టుల సందర్శన క్రమంలో చంద్రబాబు చిత్తూరు జిల్లా పుంగనూరులో అడుగు పెట్టారు. ఆయన 10 రోజుల పర్యటన క్రమంలో పుంగనూరుకు వెళ్లారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఆయా జిల్లాల పోలీసులకు ముందుగానే తెలియచేస్తుంటారు. పైగా చంద్రబాబునాయుడు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతతో ఉన్నారు. అందుకే, కేంద్ర నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు (Jagan Punganuru) రోడ్ మ్యాప్ ను సమీక్షిస్తుంటాయి. అయినప్పటికీ వైసీపీ శ్రేణులు చంద్రబాబు పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.
అధికారపక్షం శ్రేణులు రాళ్లదాడులకు తరచూ దిగడం
గతంలోనూ చంద్రబాబు పర్యటనలను అడ్డుకోవడానికి అధికారపక్షం (Jagan Punganuru) శ్రేణులు ప్రయత్నం చేశాయి. అంతేకాదు, అమరావతి రైతులు చేసిన మహాపాదయాత్రను గోదావరి జిల్లాలకు వెళ్లిన తరువాత అడ్డుకున్నారు. కోడిగుడ్లు, రాళ్లతో దాడికి దిగారు. ఇక జనసేనాని పవన్ వారాహి యాత్ర మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు చంద్రబాబు పర్యటన అడ్డుకోవడానికి బరితెగించారు. ఇలా చేయడం ప్రజాస్వామ్యబద్ధం కాదు. కంచే చేను మేసిన చందంగా శాంతిభద్రతలను కాపాడుకోవాల్సిన అధికారపక్షం శ్రేణులు రాళ్లదాడులకు తరచూ దిగడం ఏపీని ఎలాంటి రాజకీయాల వైపు నడిపిస్తున్నారు? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
పవన్ వారాహి యాత్ర మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నం
చిత్తూరు జిల్లా పుంగనూరు బైపాస్ వద్దకు చంద్రబాబు చేరుకునే సమయానికి వైసీపీ శ్రేణులు రాళ్ల దాడికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. అలాంటి సమాచారాన్ని ముందుగానే అందుకున్న టీడీపీ క్యాడర్ ప్రతిదాడికి దిగడానికి రెడీ అయ్యాయని సమాచారం. వెరసి ఇరు వర్గాల మధ్య రాళ్లదాడులు, భయానక వాతావరణం (Jagan Punganuru) నెలకొంది. పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. రబ్బర్ బుల్లెట్లతో కాల్పుకు దిగారు. దీంతో ఇరు వర్గాలు చెల్లాచెదరు కావడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో పోలీసులు వైఫల్యం క్లియర్ గా కనిపిస్తోంది.
Also Read : Jagan Rule : వినుకొండ లో పోలీస్ కాల్పులు, కడప తరహా టెంపర్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పర్యటనకు పోలీసులు తగిన ఏర్పాట్లు చేయాలి. అవాంఛనీయ సంఘటనలను జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిఘా వర్గాల సమాచారం మేరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ ఏమీలేకుండా ఇరువర్గాలు ఘర్షణ పడేందుకు అనువుగా పోలీసులు వ్యవహరించారని తెలుస్తోంది. పైగా అధికారపక్షం కొమ్ముకాస్తున్నారని ఎప్పటి నుంచో పోలీసుల మీద ఉన్న అపవాదు. గతంలో చిత్తూరు పర్యటన చేసినప్పుడు కూడా చంద్రబాబు మీద రాళ్ల దాడి ప్రయత్నం జరిగింది. గత చరిత్రను సమీక్షించుకుని పోలీసులు అప్రమత్తం కావాలి. అలాంటి ప్రయత్నం చేయనందున పుంగనూరులో (Jagan Punganuru) ఘర్షణ నెలకొంది.
Also Read : CBN Project Fight : చంద్రబాబు యుద్ధభేరి!పెద్దిరెడ్డి సై!!
ఎన్నికల నాటికి ఇలాంటి హై టెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవాలని వైసీపీ ప్లాన్ చేస్తుందని టీడీపీ చెబుతోంది. అందుకే, గోదావరి జిల్లాల్లో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హడావుడి అంటూ అనుమానిస్తున్నారు. అలాగే, కృష్ణా జిల్లాల్లో మంత్రి జోగి రమేష్ హల్ చల్ చేస్తుంటారని గుర్తు చేస్తున్నారు. ఇక గుంటూరు జిల్లా పల్నాడు కేంద్రంగా నాలుగు రోజుల క్రితం టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ నెలకొంది. వినుకొండ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు చేసిన హడావుడిని చూశాం. నెల్లూరు జిల్లాలోనూ టీడీపీ లీడర్ మీద దౌర్జన్యం చేయడం ద్వారా భయకంపితుల్ని చేస్తున్నారు. ఇలా ప్రతి ప్రాంతంలోనూ టెన్షన్ క్రియేట్ చేయడం ద్వారా కడప తరహా పాలిటిక్స్ కు జగన్మోహన్ రెడ్డి వ్యూహం రచించారని టీడీపీ చెబుతోంది.
Also Read : TDP vs YCP : పెద్దాపురంలో టెన్షన్.. టెన్షన్.. అవినీతిపై సవాళ్లు చేసుకున్న టీడీపీ – వైసీపీ నేతలు
వాస్తవంగా పులివెందుల వెళ్లిన చంద్రబాబుకు అక్కడి ప్రజలు అపూర్వస్వాగతం పలికారు. మునుపెన్నడూ లేని విధంగా జనం హాజరయ్యారు. ఎప్పుడూలేని విధంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబుకు మద్ధతు పలుకుతూ జననీరాజనం కనిపించింది. అదే విషయాన్ని నిఘా వర్గాల ద్వారా అందుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రతిగా పుంగనూరు వద్ద చంద్రబాబుపై రాళ్లకు డైరెక్షన్ ఇచ్చారని టీడీపీ ఆరోపిస్తోంది. కారణం ఏమైనప్పటికీ విపక్షాల సమావేశాలు, రోడ్ షోలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న ప్రభుత్వానిదే. అందుకు భిన్నంగా ఘర్షణలకు దిగుతోన్న వైసీపీ లక్ష్యం రాష్ట్రాన్ని కడప తరహాలో చేయడమేనని విపక్షాల అభిప్రాయం.