Jagan : తూర్పు గోదావరి పర్యటనకు సిద్దమవుతున్న జగన్
Jagan : తాజాగా నెల్లూరులో జగన్ పర్యటన సందర్భంగా ఆంక్షలను ఉల్లంఘించిన నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జైలులో ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులను జగన్ పరామర్శిస్తుండటం ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశ్యం
- By Sudheer Published Date - 01:13 PM, Fri - 1 August 25

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి (Jagan) జిల్లాల పర్యటనలు వరుసగా వివాదాస్పదమవుతున్నాయి. ఆయన పర్యటనల సందర్భంగా పోలీసుల ఆంక్షల విధింపు, వైఎస్సార్‌సీపీ నాయకులు జన సమీకరణను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. తాజాగా నెల్లూరులో జగన్ పర్యటన సందర్భంగా ఆంక్షలను ఉల్లంఘించిన నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జైలులో ఉన్న వైఎస్సార్‌సీపీ నాయకులను జగన్ పరామర్శిస్తుండటం ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశ్యం. తాజాగా, ఆయన గోదావరి ప్రాంత పర్యటనకు సిద్ధమవుతుండటంతో, పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఈ పర్యటన రాజకీయంగా ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
Rajya Sabha : రాజ్యసభలో గందరగోళం.. ప్రతిపక్ష ఆందోళనలతో సభ మధ్యాహ్నం వరకు వాయిదా
జగన్ వరుసగా జిల్లాలకు వెళ్లి పరామర్శలు చేస్తున్నారు. పల్నాడు పర్యటనలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో జగన్ పర్యటనల వేళ పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఈ పర్యటనలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, భారీగా జన సమీకరణతో తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, పోలీసులు ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. తన పర్యటనలపై ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని జగన్ ప్రశ్నిస్తున్నారు. నెల్లూరులో జైలులో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని, అలాగే మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి జగన్ పరామర్శించడాన్ని టీడీపీ నాయకులు తప్పుబడుతున్నారు.
Pawan Kalyan : వీరమల్లు బాధను OG తీరుస్తుందా..?
కాగా, ఇప్పుడు జగన్ కూటమికి కంచుకోటగా ఉన్న తూర్పు గోదావరి పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 5న రాజమండ్రి జైలులో మిథున్ రెడ్డిని పరామర్శించాలని జగన్ నిర్ణయించారు. గత నెల 20న అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులోని స్నేహా బ్లాక్‌లో ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలోనూ ఇదే బ్లాక్‌లో ఉన్న విషయాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. మిథున్ రెడ్డి అరెస్ట్‌ను జగన్ ఇప్పటికే ఖండించారు. అసలు లిక్కర్ వ్యవహారాలతో మిథున్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన ప్రశ్నించారు. జగన్ రాజమండ్రి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటన వేళ మరోసారి పోలీసులు ఆంక్షలు విధించే అవకాశం ఉంది. దీంతో రాజమండ్రి పర్యటనపై రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.