HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Met Mlcs Camp Office

Jagan : కళ్లు మూసుకుంటే ఐదేళ్లు పూర్తి .. నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు – జగన్

‘ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాం.. ఈ ఎన్నికల్లో ఏమైందో తెలియదు.. కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోయాయి.. మళ్లీ 2024 నుంచి 2029 వరకు కళ్లు మూసుకుంటే ఎన్నికలు వచ్చేస్తాయి'

  • Author : Sudheer Date : 13-06-2024 - 10:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Met Mlcs Camp Office
Jagan Met Mlcs Camp Office

‘ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాం.. ఈ ఎన్నికల్లో ఏమైందో తెలియదు.. కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోయాయి.. మళ్లీ 2024 నుంచి 2029 వరకు కళ్లు మూసుకుంటే ఎన్నికలు వచ్చేస్తాయి.. ఎవ్వరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు’ ఈ మాటలు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఈరోజు క్యాంపు ఆఫీస్ లో అన్నమాటలు. వై నాట్ 175 అంటూ ఎన్నికల్లోకి దిగిన వైసీపీ..కూటమి దెబ్బకు కోలుకోలేకపోయింది. 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన పార్టీ ..కేవలం 11 సీట్లకు పరిమితం అయ్యింది. ఇంత ఘోరంగా ఓటమి చెందుతుందని ఎవ్వరు ఊహించలేదు. ఈ పరాజయం తర్వాత జగన్ ఒకిత్త కన్నీరు కూడా పెట్టె స్థితికి వచ్చారు. ప్రస్తుతం ఈ ఓటమి నుండి మెల్లగా బయటకు వచ్చేందుకు ట్రై చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో ఈరోజు తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీ ఎమ్మెల్సీల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ ఫలితాలు చూసి మీరు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. గడచిన ఐదేళ్ల కాలంలో గత చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏకంగా 99శాతం వాగ్దానాలు అమలు చేశాం అని చెప్పుకొచ్చారు. ‘ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాం.. ఈ ఎన్నికల్లో ఏమైందో తెలియదు.. కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోయాయి.. మళ్లీ 2024 నుంచి 2029 వరకు కళ్లు మూసుకుంటే ఎన్నికలు వచ్చేస్తాయి.. ఇప్పటి వరకూ సినిమాలో ఫస్ట్‌ ఆఫ్‌ మాత్రమే అయింది అని పేర్కొన్నారు.

ఈ మాటలు విన్న నేతలే కాదు సోషల్ మీడియా లో నెటిజన్లు కూడా సెటైర్లు వేస్తున్నారు. అలా కళ్లు మూసుకుని ఐదేళ్లు గడపబట్టే, పాలన లేక ఆంధ్రప్రదేశ్‌ మటాష్‌ అయిపోయింది’, ‘మేమూ అదే చెప్పాం సర్‌.. మీరు ఇక కళ్లు మూసుకుని ప్రశాంతంగా పడుకోండి’, ఎందుకు ఓడిపోయామో కళ్లు తెరిచి బూతులు మాట్లాడకుండా పోరాటం చేయండి’, ‘ఐప్యాక్‌ స్క్రిప్ట్‌ లేకపోతే మాటలు ఇలాగే ఉంటాయి’, ‘కళ్లు మూసుకుంటేనే మీకు 11 సీట్లు వచ్చాయి’,‘2049 వరకూ కళ్లు మూసుకుని ఉండాలి’ అంటూ కామెంట్స్ వేస్తున్నారు.

Read Also : Pawan Kalyan: బొకేలు, శాలువాలు వద్దు.. మంత్రి పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • camp office
  • jagan
  • MLC

Related News

Supreme Court

Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు అజారుద్దీన్‌, కోదండ‌రాంల నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ పిటిషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నామినేషన్లకు సంబంధించిన ఫైళ్లు, ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే సమర్పించాలని కోరిన పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరిస్తూ తదుపరి విచారణను జూలై 22కు వాయిదా వేసింది. జస్టిస్ విక్ర‌మ్ నాథ్‌, జస్టిస్ సందీప్ మెహ‌తాలతో కూ

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

Latest News

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd