HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Has Come To The Real World Yet

YS Jagan : జగన్ ఇప్పటికైనా వాస్తవ ప్రపంచంలోకి రావయ్యా..!!

YS Jagan : తాను చేసేదే కరెక్ట్..అన్నట్లు ఇప్పటికి అలాగే ప్రవర్తిస్తున్నాడు. తన హయాంలో ఏ తప్పులు జరిగాయి..? ఎలా జరిగాయి..? అందులో తన పాత్ర ఎంత ఉంది..? తన పార్టీ నేతల తీరు ఎలా ఉంది..?

  • Author : Sudheer Date : 14-11-2024 - 3:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Strong Warning
Jagan Strong Warning

వైస్ జగన్ (YS Jagan)..వైస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తాడని..రాజకీయాల్లో తండ్రి పేరును నిలబడతారని..తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడని అంత భావించారు. రాజకీయాల్లో చక్రం తిప్పుతారని..ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకొని 2019 ఎన్నికల్లో భారీ మెజార్టీ తో గెలిపించారు. కానీ జగన్ ను గెలిపించి ఎంత పెద్ద తప్పు చేసామో అనేది తొందరలోనే పసిగట్టారు. కానీ ఏంచేయలేని పరిస్థితి. జగన్ ఏంచేస్తే అది చూసుకుంటూ పోయారు.

టైం చూసుకొని అడ్రెస్ లేకుండా చేసారు. ప్రజలు ఎందుకు తమను ఓడగొట్టారో..కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనంతగా చేసారని ఇప్పటికి కూడా జగన్ ఆలోచించడం లేదు. తాను చేసేదే కరెక్ట్..అన్నట్లు ఇప్పటికి అలాగే ప్రవర్తిస్తున్నాడు. తన హయాంలో ఏ తప్పులు జరిగాయి..? ఎలా జరిగాయి..? అందులో తన పాత్ర ఎంత ఉంది..? తన పార్టీ నేతల తీరు ఎలా ఉంది..? ప్రజలు ఎందుకు ఛీ కొట్టారు..? ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏమిచేస్తుంది..? ఇలాంటి మార్పులు చేస్తుంది..? ప్రజలు ఏమనుకుంటున్నారు..? ఇవన్నీ గ్రహించడం మానేసి..ఎంతసేపూ తమదే కరెక్ట్ అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. జగన్ చేస్తున్న తీరు..తీసుకుంటున్న నిర్ణయాలు ఆయన్ను మరింత దూరం చేస్తున్నాయి. జగన్ వాస్తవ ప్రపంచంలోకి రాడా.? అసలు ఆ ఆలోచనా కూడా చేస్తున్నట్లే లేదే అని ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈసారి కూడా జగన్ సమావేశాలకు దూరంగా ఉన్నాడు. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. సభా వ్యవహారాల విషయంలో కోర్టు చెబితే తనకు ప్రతిపక్ష నేత పదవి ఇచ్చేయాల్సిందేనని.. అనర్హతా వేటు వేస్తే కోర్టులకు వెళ్తామని ఆయన అమాయకంగా చెబుతున్నారు. రాజ్యాంగం గురించి ..సభా హక్కుల గురించి ఇంత కనీస అవగాహన లేకుండా జగన్ రెడ్డి ఎలా మాట్లాడుతారో వైసీపీలోని జూనియర్ నేతలకూ అర్థం కావడం లేదు. సీఎంగా పని చేసిన వ్యక్తికి ఉన్న అవగాహన ఇదేనా అని ఆశ్చర్యపోతున్నారు.

భారత రాజ్యాంగం శాసనసభకు ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. సభా నిర్వహణ వరకూ సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదు. సభా నియమాలు, సంప్రదాయాల ప్రకారం నడుస్తుంది. ఫలానా వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి.. ఫలానా వ్యక్తిని స్పీకర్ ను చేయాలి.. సభలో ఫలానా విధంగా జరిగింది కాబట్టి మేము చెప్పినట్లుగా చేయాలి అని కోర్టులు ఆదేశించలేవు. ఆ అధికారం వారికి లేదు. సభా వ్యవహారాల్లో పూర్తి అధికారం స్పీకర్‌కు ఉంటుంది. జగన్ రెడ్డికి ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోవడం ఏంటి..? అని అంత మాట్లాడుకుంటున్నారు. మరి జగన్ ఎప్పుడు మారతారో..రూల్స్ ఎప్పుడు పాటిస్తారో అని రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు.

Read Also : Team India World Record: టీమిండియా పేరిట ప్ర‌పంచ రికార్డు.. ఏంటంటే..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Assembly Session
  • jagan
  • tdp

Related News

NRI TDP

TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

తెలుగుజాతి మనుగడ ఉన్నంతకాలం తెలుగుప్రజల హృదయాల్లో అన్న ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలచిపోతారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. లాస్ ఏంజల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యాన ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలను లాస్ ఏంజిల్స్ ఆరంజ్‌ సిటీ తండూరి రెస్టారెంట్ లో ఘనంగా నిర్వహించారు. లాస్ ఏంజిల్స్ ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు అట్లూరి శ్రీహరి, హేమకుమార్ గొట

  • AP

    AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

  • Gade Venkatreddy

    Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

  • Imresizer Whatsapp Image 2026 05 29 At 4.10.59 Pm

    TDP : యువత భవిష్యత్తును చీకట్లోకి నెట్టిన చరిత్ర జగన్ కుటుంబానిదే: ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి

  • Mahanadu

    Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

Latest News

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

  • TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd