జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పింఛన్ ఎక్కడైనా తీసుకునేలా!
ఏపీలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం పేదల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. పేదల అభ్యున్నతి కోసం నవరత్నాలు లాంటి పథకాలు అమలు చేస్తున్నా.. వాటి ఆచరణ సక్రమంగా లేదనే విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పింఛన్లకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది.
- By Balu J Published Date - 01:55 PM, Fri - 1 October 21

ఏపీలో మొదటిసారి అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం పేదల కోసం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు సాగుతోంది. పేదల అభ్యున్నతి కోసం నవరత్నాలు లాంటి పథకాలు అమలు చేస్తున్నా.. వాటి ఆచరణ సక్రమంగా లేదనే విమర్శలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం ప్రభుత్వ పింఛన్లకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీలో అసలైన అర్హులకు ఏ చిన్న ఇబ్బందీ కలగకుండా ఉండేందుకు యోచిస్తోంది. లబ్ధిదారులు సొంత ఊరిలో కాకుండా రాష్ట్రంలో మరో చోట నివాసం ఉన్నా.. ఉన్న చోటనే పింఛన్ పొందేలా వీలు కల్పించింది. ఈ మేరకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) సీఈవో ఇంతియాజ్ అన్ని జిల్లా డీఆర్‌డీఏ పీడీలకు బుధవారం ఆదేశాలిచ్చారు.
వాళ్లకు మాత్రమే..
ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం ఆరు నెలలుగా వేరేచోట ఉన్నవాళ్లకు మాత్రమే వర్తిస్తుందని తేల్చి చెప్పింది. అయితే ఇందుకోసం ఏం చేయాలంటే లబ్ధిదారుడు నివాసం ఉంటున్న పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయంలో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. సొంత ఊరు వదిలి కనీసం ఆరు నెలలు అయితేనే ఇలా ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుంది.
బోగస్ లబ్ధిదారులపై ఫోకస్
ఆంధ్రప్రదేశ్ లో ఫించన్ లబ్ధిదారుల విషయంలో చాలా రోజుల నుంచి దుమారం రేగుతోంది. బోగస్ లబ్ధి దారులు ఎక్కువ ఉన్నారని, అసలైన అర్హులకు ఫించన్ అందడం లేదని.. దీనిపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసింది. వెంటనే లబ్ధి దారుల ప్రక్రియపై ఫోకస్ చేసింది. చాలావరకు అనర్హులు ఫించన్లు తీసుకుంటున్నారని.. అసలైన లబ్ధి దారులకు ఫించను రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి దీంతో అనర్హుల ఏరివేతపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. జిల్లాల వారికి ఏరివేతకు సర్వే చేస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్ లో ఫించను లబ్ధిదారుల ఎంపికపై అధికారులు ఫోకస్ చేశారు. చాలావరకు అనర్హులు ఫించన్లు తీసుకుంటున్నారని.. అసలైన లబ్ధిదారులు ఫించన్ తీసుకునేందుకు జగన్ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
Related News

TTD Update : టీటీడీ తిరుమల శ్రీవాణి వీఐపీ బ్రేక్ దర్శనం
టీటీడీ (TTD) దేవస్థానం వారు తిరుమల శ్రీవాణి వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ల పైన కొత్త అప్డేట్ ఇచ్చారు.