HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagan Going To Delhi

Jagan : ఢిల్లీ బాట పట్టబోతున్న జగన్..?

Jagan : జగన్‌కు ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ నుంచి కూడా ఎలాంటి మద్దతు లభించే అవకాశం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీ పీసీసీ ఇంచార్జ్‌తో పాటు పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా జగన్‌పై ఘాటు విమర్శలు చేస్తుండటంతో

  • Author : Sudheer Date : 25-07-2025 - 8:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
YS Jagan
YS Jagan

ఆంధ్రప్రదేశ్ లో వరుసగా వైసీపీ నేతలఫై (YCP Leaders) కేసులు ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. లిక్కర్ స్కాం, క్వార్ట్జ్ గనుల అక్రమాలు, రాజకీయ నేతల అరెస్టులు వంటి అంశాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు కావడం, మాజీ మంత్రులపై కేసులు నమోదవడం, కొంతమంది నేతలు ముందస్తు బెయిలు కోసం ప్రయత్నించడం ఇలా అన్ని కలిపి పార్టీపై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తున్నాయి. ఇదే సమయంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్టు అయ్యే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు ఊపందుకోవడంతో ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశాలపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.

ఈ కేసులను కేంద్రం లేదా చంద్రబాబు ప్రభుత్వం తనపై రాజకీయ ప్రతీకారంగా వాడుతోందని ప్రజల్లో నమ్మకం కలిగించాలనే లక్ష్యంతో జగన్ ఢిల్లీ (Jagan Delhi ) వెళ్లే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అక్కడ ధర్నా చేయడం లేదా విపక్ష పార్టీలను కలవడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగుతోందని ప్రచారం చేయాలని వైఎస్సార్‌సీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే బెంగళూరు నుంచి తనకు మద్దతు తెలిపిన పార్టీలను సంప్రదిస్తున్నట్టు సమాచారం. ఈ కారణంగానే జగన్ ఈ వారం తాడేపల్లికి రాలేదన్న ప్రచారం జరుగుతోంది.

Non-veg Food: శ్రావ‌ణ మాసంలో నాన్ వెజ్ తిన‌కూడ‌దా? కార‌ణాలీవే?!

గతంలో ఢిల్లీలో జరిగిన ధర్నాలో శివసేన సహా ఇండీ కూటమిలోని పలు పార్టీలు జగన్‌కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, జగన్ తర్వాత ఎన్డీఏకు సమర్థన తెలిపిన తీరు, విపక్ష కూటమికి సహకారం లభించనట్టుగా వ్యవహరించడం వల్ల, ఇప్పుడు అదే పార్టీలు మళ్లీ మద్దతు ఇవ్వడం సందేహాస్పదంగా మారింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, గతంలో మద్దతిచ్చిన పార్టీలు ఈసారి పక్కకు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

జగన్‌కు ప్రధాన విపక్షమైన కాంగ్రెస్ నుంచి కూడా ఎలాంటి మద్దతు లభించే అవకాశం లేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీ పీసీసీ ఇంచార్జ్‌తో పాటు పార్టీ అధ్యక్షురాలు షర్మిల కూడా జగన్‌పై ఘాటు విమర్శలు చేస్తుండటంతో, కాంగ్రెస్ సహా ఇతర ముఖ్యమైన విపక్ష పార్టీల మద్దతు ఆయనకు దూరంగా ఉన్నట్టే కనిపిస్తోంది. మొత్తంగా చెప్పాలంటే, జగన్ ఢిల్లీకి వెళ్లే ప్రణాళిక ఉంటే అది రాజకీయంగా చర్చనీయాంశంగా మారినా, మద్దతు విషయంలో మాత్రం ఆయన ఒంటరివాడై అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూద్దాం మరి ఏంజరుగుతుందో !!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • jagan
  • Jagan Delhi
  • Kutami Govt
  • ycp leaders arrest

Related News

Midhun Reddy

Kutami Govt : కూటమి ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారంటూ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

మహిళల భద్రత విషయంలో రాజీ పడకూడదని, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మౌనంగా ఉండటం నేరస్తులను ప్రోత్సహించినట్లే అవుతుందని మిథున్ రెడ్డి హెచ్చరించారు

  • Jagan Lotus Pond

    YCP Jagan : మళ్లీ లోటస్‌పాండ్ కు జగన్ మకాం ?

Latest News

  • Lip Lock : విజయ్ దేవరకొండ కు లిప్ లాక్ ఇవ్వలని ఉందంటూ పబ్లిక్ గా చెప్పిన నటి..మరి రష్మిక పర్మిషన్ ఇస్తుందా ?

  • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

  • హోర్ముజ్ జలసంధి.. ఇండియన్ నేవీ కొత్త అడ్వైజరీ!

  • kothavalasa : ఉపాధి హామీ పనులు చేస్తుండగా బాంబు బ్లాస్ట్..పలువురికి గాయాలు

  • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

Trending News

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd