Jagan : వైస్ జగన్ ఇంట విషాదం
Jagan : 85 ఏళ్ల వయస్సులో వయోభార్యంతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా పులివెందులలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు
- By Sudheer Published Date - 11:13 AM, Thu - 27 March 25

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Jagan) ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. జగన్ పెద్దమ్మ సుశీలమ్మ (Sushilamma) అనారోగ్యంతో కన్నుమూశారు. 85 ఏళ్ల వయస్సులో వయోభార్యంతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా పులివెందులలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన సుశీలమ్మ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నయ్య ఆనంద్ రెడ్డి సతీమణి. ఆమె మరణ వార్త తెలుసుకున్న వైఎస్ జగన్, వెంటనే పులివెందుల వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
Breakfast : బ్రేక్ఫాస్ట్ లో తినాల్సిందే ఇవే
సుశీలమ్మ అంత్యక్రియలు మరికాసేపట్లో పులివెందులలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇటీవలే ఆయన పులివెందులలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించారు. తాజాగా బుధవారం రాత్రి విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందుకు హాజరైన జగన్, తన కుటుంబానికి సంభవించిన విషాద వార్త తెలుసుకున్న వెంటనే తాడేపల్లి నుంచి పులివెందుల వెళ్లనున్నారు. జగన్ కుటుంబంలో ఇది ఒక్కటే కాకుండా ఇటీవల మరికొన్ని విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. గతేడాది ఆయన సోదరుడు అభిషేక్ రెడ్డి ఆకస్మికంగా మరణించగా, ఇటీవలే వైఎస్ జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ కన్నుమూశారు. ఇక ఇప్పుడు సుశీలమ్మ మరణం.