Jagan Fake Sign : CMOలో ఐ ప్యాక్ దొంగలు?లూటీ ఈనాటిది కాదు.!!
జగన్మోహన్ రెడ్డికి పాలన మీద పట్టులేదని చెప్పడానికి ఫోర్జరీ సంతకాలు (Jagan Fake Sign) వ్యవహారం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది.
- Author : CS Rao
Date : 12-08-2023 - 3:52 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పాలన మీద పట్టులేదని చెప్పడానికి ఫోర్జరీ సంతకాలు (Jagan Fake Sign) వ్యవహారం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రస్తుతం వెలుగుచూసిన ఫోర్జరీ సంతకాల వ్యవహారం ఈనాటిది కాదు, రెండేళ్ల క్రితమే ఐప్యాక్ పేరుతో కొందరు సీఎంవోతో పాటు సీనియర్ ఐఏఎస్ ల సంతకాలను ఫోర్జరీ చేసిన దాఖలాలు ఉన్నాయి. అప్పట్లో వెలుగుచూసిన ఆ అంశాన్ని నాన్ సీరియస్ గా తీసుకోవడంతో ఇప్పుడు సీఎంవోలోకి జొరబడ్డారు. కొన్ని వేల కోట్ల రూపాయాల విలువైన ఫైళ్లకు క్లియరెన్స్ లభించిందని టీడీపీ ఆరోపిస్తోంది. సుమారు 225 ఫైళ్ల ను సీఎం జగన్మోహన్ రెడ్డి సంతకాలను పోర్జరీ చేసి ప్రజా ధనాన్ని లూటీచేశారని ప్రత్యర్థి పార్టీల ఆరోపణలు.
2021వ ఏడాది జనవరిలోనే ఐప్యాక్‌లో పనిచేస్తున్నానంటూ చంద్రశేఖర్ ఫోర్జరీ
వాస్తవంగా 2021వ ఏడాది జనవరిలోనే ఐప్యాక్‌లో పనిచేస్తున్నానంటూ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఫోర్జరీ సంతకాల (Jagan Fake Sign) వ్యవహారంలో పట్టుబడ్డారు. అప్పట్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వ్యవహారాలను చూస్తున్నానని పలువుర్ని నమ్మించాడు. వైసీపీకి పనిచేస్తున్నావని సీఎం తనకు జగన్ ప్రశంసాపత్రం ఇచ్చినట్లు ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసిన పత్రం వెలుగుచూసింది. సీఎం పేషీలో సలహాదారు పదవి ఇస్తానని, సాగర్‌మాల ప్రాజెక్టులో ఉద్యోగమిస్తానంటూ లోకాభిరాముడు అనే వ్యక్తిని మోసం చేశారు. సీఎం పేషీలో సలహాదారు పదవిని లోకాభిరాముడికి ఇచ్చినట్లు ముఖ్యమంత్రి ఓఎస్డీ నకిలీ సంతకంతో ఉన్న లేఖను అందజేశాడు. అంతేకాదు రెవెన్యూ శాఖలో ఉన్నతాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి లోకాభిరాముడికి విశాఖపట్నంలో ప్రభుత్వం నాలుగెకరాలు ఇచ్చినట్లు పత్రాలు సృష్టించాడని అప్పట్లో పోలీసులు తేల్చారు. కానీ, ఆ ఫోర్జరీ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం లైట్ గా తీసుకుంది. సీన్ కట్ చేస్తే, రెండేళ్ల తరువాత మళ్లీ అదే తరహా ఫోర్జరీ వ్యవహారం సీఎంవోలు బయట పడింది.
ముఖ్యమంత్రి డిజిటల్ సంతకాలను దుర్వినియోగం (Jagan Fake Sign)
సీఎంవోలో డిజిటల్ సంతకాన్ని డేటాఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్లు ఉపయోగించి సీఎంపీలు జారీ చేసే పరిస్థితి ఉండదు. సీఎంవోలో జరిగిన ఈ భాగోతం వెనుక పెద్ద తలకాయలు ఉంటారని సర్వత్రా వినిపిస్తోంది. అయితే సీఐడీ మాత్రం అటెండర్ ఆ స్థాయి ఉద్యోగుల్ని ఐదుగురిని ఈ వ్యవహారానికి బాధ్యులుగా (Jagan Fake Sign) చేసింది.అందుకే, ఈ కేసు వెనుక కొన్ని కీలకమైన విషయాలు దాగి ఉన్నాయన్న ఆరోపణలు కోకొల్లలు.
ముఖ్యమంత్రి డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేసిన కేసులో సీఐడీ ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను శనివారం సైబర్ క్రైమ్ సీఐడి ఎస్పీ హర్ష వర్ధన్ రాజు వెల్లడించారు. కార్యదర్శుల డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేసి ‘సీఎం పిటిషన్’లు జారీ చేసినట్లు వెల్లడించారు. ఒక్కో ఫైల్‌కు ₹30 వేల నుంచి ₹50 వేల వరకూ వసూలు చేశారని చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి 3 నెలలలో 66 సీఎంపీలను జారీ చేసినట్టు గుర్తించారు. అందుకోసం ₹15 లక్షల వరకూ వసూలు చేసినట్లు చెబుతున్నారు. అయితే, ఏ ఫైల్‌కూ తుది ఆమోదం రాలేదని ఆయన వెల్లడించారు. మరింత లోతుగా ఈ కేసును విచారిస్తుమని రాజు ప్రకటించారు.
Also Read : AP CMO: ఇదేందీ..అయ్యా యెస్
డాక్టర్లు, టీచర్‌ల బదిలీకి సంబంధించిన ఫైల్స్‌కు (Jagan Fake Sign) సీఎంపీలు జారీ చేశారు. సీఎం పేషీలోని కార్యదర్శి భరత్ గుప్తా మొదట ఈ డిజిటల్ సంతకాల టాంపరింగ్ చేసినట్టు గుర్తించి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. సీఎంవో ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య డిజిటల్ సంతకం దొంగిలించి సీఎంపీలు జారీ చేశారు. సీఎం కార్యాలయంలోని అధికారుల అధికారిక లాగిన్ వివరాలను తెలుసుకుని తమకు కావాల్సిన ఫైళ్లకు ఉన్నతాధికారులకు తెలియకుండా డిజిటల్ సిగ్నేచర్ ద్వారా అప్రూవల్ ఇచ్చేసినట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై సీఎంవో మఖ్య కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి దృష్టి సారించారు. సీఎంపీల ఫోర్జరీ, ఉన్నతాధికారుల లాగిన్ వివరాల దుర్వినియోగంలో తన పేషీలోని అటెండర్ , డేటా ఎంట్రీ ఆపరేటర్ల పాత్ర ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు.
Also Read : Jagan Punganuru : 30ఏళ్ల పాటు సీఎం కల ఫలితం `పుంగనూరు` ఎపిసోడ్ ?
ఏపీ సీఎంవోలో డిజిటల్ సంతకాల దుర్వినియోగంపై విపక్షాలు ఇప్పటికే జగన్ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రికి తెలియలేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. అరెస్టు చేసిన ఐదుగురు నిందితుల్ని కోర్టులో హాజరు పర్చి రిమాండ్ విధించారు. కానీ, సీఎంవోలోని ఈ భాగతం వెనుక పెద్దలు ఉన్నాయని సర్వత్రా వినిపిస్తోంది. వాస్తవంగా సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత పలువురు పైరవీకారులు (Jagan Fake Sign) సచివాలయంలో హవా సాగించారు. సానుకూలంగా ఉన్న వాళ్ల కు పెండింగ్ లో ఉన్న కాంట్రాక్టు బిల్లుల ఫైళ్లను కూడా క్లియర్ చేశారు. మొత్తం 225 ఫైళ్ల తాలూకూ నగదు ట్రెజరీ నుంచి వెళ్లిందని లోకేష్ ఆరోపిస్తున్నారు. భారీ కుంభకోణం వెనుక జగన్మోహన్ రెడ్డి, ఐ ప్యాక్ దొంగలు ఉన్నారని వస్తోన్ ఆరోపణలు ఆగడంలేదు.