Sankranti 2025 : రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందాం రండి – ITDP ట్వీట్
Sankranti 2025 : పండుగ సెలవులు ప్రారంభం కావడం తో నగరంలోని రోడ్లపై ట్రాఫిక్ తగ్గిపోయి, నిర్మానుష్యంగా కనిపిస్తే.. హైవేలు మాత్రం వాహనాలతో కిక్కిరిసిపోయాయి
- By Sudheer Published Date - 12:26 PM, Sat - 11 January 25

సంక్రాంతి (Sankranti 2025) పండుగ సందర్బంగా హైదరాబాద్ (Hyderabad) మహానగరం నిర్మానుష్యంగా మారింది. పండుగ సెలవులు ప్రారంభం కావడం తో నగరంలోని రోడ్లపై ట్రాఫిక్ తగ్గిపోయి, నిర్మానుష్యంగా కనిపిస్తే.. హైవేలు మాత్రం వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ప్రజలంతా పల్లె బాట పట్టడం తో బస్టాండ్లు మరియు ప్రధాన కూడళ్లలో రద్దీ కనిపిస్తోంది. ఈ తరుణంలో ITDP ఆసక్తికర ట్వీట్ చేసింది.
Pongal 2025 : సంక్రాంతి కోసం సొంతూళ్లకు వెళ్తున్నారా..ఈ జాగ్రత్తలు పాటించండి
‘అమరావతిని నిర్మించుకుందాం, విశాఖను IT హబ్‌గా తీర్చిదిద్దుకుందాం, రాయలసీమకు పరిశ్రమలు తీసుకురావడం ద్వారా ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించుకుందాం’ అంటూ పిలుపునిచ్చింది. ఈ ప్రకటన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం విషయంలో ఒక ఆశాజనక దృక్కోణాన్ని సూచించింది. సాంకేతికతను, పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించడం ద్వారా ప్రజలు ఇతర రాష్ట్రాలకు, లేదా విదేశాలకు వెళ్లే అవసరం తగ్గుతుందని ఈ ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు. ITDP ఈ పిలుపుతో రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధికి మార్గాలు సూచించినట్లు కనిపిస్తోంది. ప్రాంతీయ అసమానతలను తగ్గించి, సమతుల అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని పరోక్షంగా తెలియజేసింది. రాజకీయవర్గాలు, నిపుణులు ITDP ఈ పిలుపును స్వాగతిస్తూ, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకుసాగాలని అభిప్రాయపడుతున్నారు. విశాఖపట్నం, అమరావతి, మరియు రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో సమగ్రతను కాపాడటం అవసరమని వారు సూచిస్తున్నారు. ఈ ట్వీట్ సాంఘిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశమైంది. సంక్రాంతి సందర్భంగా పల్లెలకు వెళ్తున్న ప్రజలకు ఈ పిలుపు ఒక కొత్త ఆలోచనకు దారితీస్తుంది.
అమరావతినీ నిర్మించుకుందాం..విశాఖనీ ఐటీ హబ్ గా తీర్చిదిద్దుకుందాం..రాయలసీమకు పరిశ్రమలు తెచ్చుకుందాం..
10 ఏళ్లు ..ఆంధ్రులకి పొరుగు దేశానికి ,రాష్ట్రానికి వెళ్ళే అవసరం లేకుండా రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందాం..
కలసిరండి..ప్రజలు గెలవాలి..రాష్ట్రం నిలవాలి !!
జై ఆంధ్రప్రదేశ్ 🔥 pic.twitter.com/PuAaheWFFG
— iTDP Official (@iTDP_Official) January 11, 2025
Today Sankranthi Rush Near RFC pic.twitter.com/gDWcEiaBld
— TWL (@laxman_travel) January 11, 2025