Chandrababu: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబుకు ఆహ్వానం
ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆహ్వానాలు అందాయి. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులు చంద్రబాబుకు ఆహ్వానం పలికారు.
- By Praveen Aluthuru Published Date - 03:35 PM, Wed - 17 January 24

Chandrababu: భారతదేశం సగర్వంగా హిందుత్వాన్ని చాటేలా, 2500 సంవత్సరాల పాటు ప్రకృతి విపత్తులను తట్టుకొని నిలబడేలా నిర్మిస్తున్న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నమైంది. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు ఆహ్వానాలు పంపిస్తోంది. ఈ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించేందుకు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
కార్యక్రమానికి మరో ఐదు రోజులే సమయం ఉండటంతో నిర్వాహకులు ఆహ్వానాలు అందించే ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. అందులో భాగంగా అయోధ్య రామజన్మభూమి ఆలయంలో ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆహ్వానాలు అందాయి. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులు చంద్రబాబుకు ఆహ్వానం పలికారు.
జనవరి 16 నుంచి అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు, 21 వరకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతాయని.. జనవరి 18న ఆలయ గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2.00 గంటల వరకు జరగనుంది
అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రామాలయ ట్రస్ట్ 7 వేల మందికి ఆహ్వానాలు పంపింది. వీళ్లలో రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు క్రికెట్ దిగ్గజాలు కూడా ఉన్నారు. వీళ్లలో మాజీ సివిల్ సర్వీసెంట్లు, ఆర్మీ అధికారులు, న్యాయవాదులు, ఇంద్రజాలికులతో పాటు పద్మశ్రీ, పద్మ భూషన్ అవార్డు విజేతలు ఉన్నారు.
Also Read: 10 Strongest Currencies : టాప్-10 పవర్‌ఫుల్ కరెన్సీల లిస్టు ఇదే.. ఇండియా ర్యాంక్ తెలుసా ?