AP Employees: ఆ నలుగురే ఉద్యోగుల టార్గెట్
ఆ నలుగురుపైన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తో కుమ్మక్కై సమ్మె విరమించారని ఆరోపణలు చేస్తున్నారు. ఆ నలుగురు గురించే ఏ ఇద్దరు ఏపీ ఉద్యోగులు కలిసినా చర్చించు కుంటున్నారు. వాళ్ళ ఆస్తులు , అంతస్తులు గురించి ఆరా తీస్తున్నారు.
- By Hashtag U Published Date - 09:57 AM, Wed - 9 February 22

ఆ నలుగురుపైన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తో కుమ్మక్కై సమ్మె విరమించారని ఆరోపణలు చేస్తున్నారు. ఆ నలుగురు గురించే ఏ ఇద్దరు ఏపీ ఉద్యోగులు కలిసినా చర్చించు కుంటున్నారు. వాళ్ళ ఆస్తులు , అంతస్తులు గురించి ఆరా తీస్తున్నారు. ఏసీబీ వద్ద ఉన్న లిస్ట్ ను బయటకు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పేరుతో, ఈ నలుగురు ఉధ్యోగస్తులకు ఏ చిన్న పని చేయించాలన్నా, లాబీయింగ్ ద్వారా లక్షల రూపాయలు సంపాదించి ఏసీబీ దృష్టిలో ఉన్నారు. కోట్లకు పడగలెతారని ఉద్యోగుల ఆరోపణ. దీంతో ఉద్యమంలోని సంఘ నాయకులు ఆ నలుగురు డకౌట్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బొప్పరాజు వెంకటేశ్వర్లు ఉన్నాడు. ప్రకాశం జిల్లాలో జరిగిన రెవెన్యూ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీచేసి చిత్తుగా ఓడిపోయాడు. ఆ తదుపరి గుంటూరు వచ్చి జాయింట్ కలెక్టర్ దగ్గర క్యాంప్ క్లర్క్ గా చేరి, నెమ్మదిగా పరపతి పెంచుకుంటూ తాసిల్దార్ అయ్యాడు. విస్తృతంగా పనిచేసి ప్రభుత్వ అండదండలతో 64 ప్రభుత్వ ఉత్తర్వులు సంపాదించాడు. ఆయన రజక సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగ లీడర్. ఉద్యోగానికి మించి సంపాదించాడని ఏసీబీ కన్ను ఆయనపై నిరంతరం ఉన్నది. అధికారంలో ఏపార్టీ ఉన్నప్పటికీ చక్రం తిప్పగల సమర్థవంత నాయకుడు. ఈ సంఘానికి ఐదుగురు స్టీరింగ్ మెంబర్స్ కలిగి ఉన్నారు.
ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడిగా ఉన్న బండి శ్రీనివాసరావు ఇరిగేషన్ శాఖలో క్లాస్ ఫోర్ ఉధ్యోగి. వాళ్ళ నాన్న అండతో సంపాదించి, ప్రస్తుతం సూపరిన్టెండెంట్ గా పనిచేస్తున్నాడు. ఇబ్బడి ముబ్బడిగా సంపాదించడం చేత ఏసీబీ కన్ను ఆయన మీద నిరంతరం ఉన్నది. ఆయన కూడ రజక సామాజికవర్గంకు చెందిన లీడర్. ఇది ఉద్యోగుల్లో పెద్ద సంఘం. కేవలం ఐదుగురు స్టీరింగ్ మెంబర్స్ కలిగి ఉన్నారు. వీరిది ప్రకాశం జిల్లా. బొప్పరాజు కూడ ఆయన బంధువు.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కే.ఆర్.సూర్యనారాయణ బ్రాహ్మణుడు సామాజిక వర్గం. లాబీయింగ్ ద్వారా గుర్తింపు పొంది జెఎసిలో ఐదుగురు స్టీరింగ్ మెంబర్లను కలిగి ఉన్నారు. సూర్యనారాయణ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. “మహిళలు మరియు రిటైర్డ్ ఉద్యోగుల కోసం డివిజన్లను ఏర్పాటు చేస్తామని కూడా హామీ ఇచ్చారు” అని నొక్కిచెప్పాడు. దిశ చట్టాన్ని తీసుకొచ్చినందుకు సీఎం జగన్‌రెడ్డిని సూర్యనారాయణ కొనియాడాడు. ఆయనకు బిజెపి బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. వైసీపీ జేబులోని మనిషి. 20 సంవత్సరాల నుండి డ్యూటీకి వెళ్ళకుండా, ఎప్పుడు ఆన్ డ్యూటీలో ఉండే ఏకైక ఉద్యోగి సూర్యనారాయణ. పేరుకు మాత్రమే కమర్షియల్ టాక్స్ లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు.
1300 మంది ఆంధ్ర ప్రదేశ్ సెక్రటేరియట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కె. వెంకటరామిరెడ్డి ఉన్నాడు. లాబీయింగ్ ద్వారా గుర్తింపు పొంది జెఎసిలో ఐదుగురు స్టీరింగ్ మెంబర్లను కలిగి ఉన్నారు. ఆయన 100 శాతం వైసీపీ మనిషి. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో 16 నెలలు సస్పెండ్ అయ్యాడు. లేటెస్ట్ గా అమరావతి జేఏసికి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. భవిష్యత్తులో వారి సతీమణి శ్వేతా రెడ్డికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సీటు గాని వైసీపీ ప్రభుత్వంలో పొందాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదులో హౌసింగ్ సొసైటీలో అక్రమాలకు పాల్పడి బాగా సంపాదించి ఉన్నాడు. ఆ కేసు రాష్ట్రం విడిపోయిన తరువాత క్లోజ్ అయింది.
చిన్న ఉద్యోగస్తులందరూ ప్రభుత్వంపై ఓడిపోయినందుకు, తీవ్రమైన మానసిక వేదనకు గురి అయ్యామన్న ఫీలింగ్ లో ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలోని ఉద్యోగస్తుల ప్రధాన సమస్య ఆ నలుగురు ను ఏవిధంగా ఎదుర్కొనాలి? రాజకీయ నేతలకు అవకాశం ఇవ్వకుండా, తిరిగి సంఘ నిర్మాణం చేసుకొవాలి అనేది సవాల్.
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల 35 వేల ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వాలని, ప్రభుత్వ శాఖలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. గ్రూప్ 1,2,3,4 పోస్టుల సంఖ్య పెంచాలని, 6500 ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని, 25 వేల టీచర్ పోస్టులు భర్తీ కోసం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 పెంచరాదు. ఆంధ్రప్రదేశ్ లో సుమారు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. వెంటనే న్యాయం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి అని ఉద్యోగులు భావిస్తున్నారు.
ఆ నలుగురు రాజ్యాధికార కాంక్ష కలిగినవారని, వైసీపీ ద్వారా రాజకీయంగా ఎదగాలని భావిస్తున్నారని ఆరోపణ. మొత్తం మీద ఆ నలుగురు గురించి ఇప్పుడు ఉద్యోగుల్లో ఆందోళన ఉంది. ప్రభుత్వం కంటే ఆ నలుగురిని ప్రమాదం గా భావిస్తున్నారు. సో..ప్రభుత్వాన్ని విడిచి ఆ నలుగురి మీద ఉద్యోగులు పడ్డారన్నమాట.