Ganta Srinivasa Rao : గంటా ఆస్తులు వేలం..?
గంటా శ్రీనివాసరావు గతంలో డైరెక్టర్‌గా వ్యవహరించిన ప్రత్యూష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తీసుకున్న బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో ఇండియన్ బ్యాంకు బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేస్తూ వస్తుంది
- Author : Sudheer
Date : 13-07-2024 - 3:12 IST
Published By : Hashtagu Telugu Desk
టీడీపీ ఎమ్మెల్యే గంట శ్రీనివాస రావు (Ganta Srinivasa Rao) ఆస్తుల వేలానికి ఇండియన్ బ్యాంకు సిద్దమైనట్లు తెలుస్తుంది. గంటా శ్రీనివాసరావు గతంలో డైరెక్టర్‌గా వ్యవహరించిన ప్రత్యూష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తీసుకున్న బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో ఇండియన్ బ్యాంకు బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేస్తూ వస్తుంది. కానీ శ్రీనివాస్ రావు మాత్రం బకాయిలు చెల్లించడం లేదు. దీంతో ఆయన ఆస్తులు వేలం వేసేందుకు బ్యాంకు సిద్ధమైంది. ఈ మేరకు ఆయనకు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఆగస్టు 08 న సంబంధిత ఆస్తులు వేలం వేయబోతున్నట్లు ప్రకటించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ గతంలో డైరెక్టర్‌గా వ్యవహరించిన ప్రత్యూష గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన ప్రత్యూష రీసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లోని ఇండియన్ బ్యాంక్ ఎస్‌ఏఎమ్ బ్రాంచ్ నుంచి రూ.141.68 కోట్ల రూపాయలు రుణంగా తీసుకుంది. దీన్ని సకాలంలో చెల్లించకపోవడంతో 2016 అక్టోబర్‌లోనే డిమాండ్ నోటీసులు ఇచ్చింది. ఆ తర్వాత కూడా రుణం తిరిగి చెల్లించకపోవడంతో వడ్డీతో కలిపి అది రూ.248.03 కోట్లకు చేరింది. ప్రస్తుతం రూ. 409 కోట్లకు చేరినట్లు బ్యాంకు తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉద్దేశపూర్వకంగా రుణాల ఎగవేత వ్యవహారాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఆర్బీఐ ఆదేశాల మేరకు రుణ ఎగవేత దారుల ఆస్తుల వేలానికి సిద్దమవుతున్నాయి. ఇదే క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఆస్తులు కూడా వేలం వేసేందుకు బ్యాంకు సిద్దమైనట్లు తెలుస్తుంది.
Read Also : West Bengal Bypolls : నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీకి విజయం ఖాయం..!