HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Imd Issues Rainfall Alert To Telangana And Ap

Heavy Rains : మళ్లీ దంచి కొడుతున్న వర్షాలు..ఆందోళనలో తెలుగు రాష్ట్రాల ప్రజలు

IMD Issues Rainfall Alert to Telangana And AP : ఈ వర్షాల బారినుండి ఇంకా ప్రజలు తేరుకోనేలేదు. ఇప్పుడు మరోసారి భారీ వర్షాలు మొదలవ్వడం ప్రజల్లో ఖంగారు పెట్టిస్తున్నాయి.

  • Author : Sudheer Date : 07-09-2024 - 7:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Weather Forecast
Weather Forecast

IMD Issues Rainfall Alert to Telangana And AP : గత కొద్దీ రోజులుగా తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains in Telugu States) వదలడంలేదు. గత వారం శుక్ర , శని , ఆదివారాల్లో కురిసిన భారీ వర్షాలకు రెండు రాష్ట్రాలు అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ వర్షాల బారినుండి ఇంకా ప్రజలు తేరుకోనేలేదు. ఇప్పుడు మరోసారి భారీ వర్షాలు మొదలవ్వడం ప్రజల్లో ఖంగారు పెట్టిస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారిందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఈరోజు, రేపు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం దాని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని ఇది ఉత్తర దిశగా కదులుతూ ఈ నెల 9వ తేదీకి ఒడిశా, పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

అల్పపీడనం కారణంగా..ఏపీలో శ్రీకాకుళం, పార్వతిపురం మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. శనివారం ఉదయం కంచికచర్లలో 33 మిల్లీ మీటర్లు, సాయంత్రం 6 గంటలకు మరో 50 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. నందిగామ, తిరువూరు, మైలవరం, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేటతో పాటు, విజయవాడ నగరంలోనూ వర్షం దంచికొట్టింది.

ఇక తెలంగాణలోను శనివారం పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ఆది, సోమ‌వారాల్లో తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. ఈ నెల 8వ తేదీన కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్త‌గూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు, ఆదిలాబాద్, క‌రీంన‌గ‌ర్, పెద్ద‌ప‌ల్లి, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. 9వ తేదీన ఆసిఫాబాద్, మంచిర్యాల‌, భూపాల‌ప‌ల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు, ఆదిలాబాద్, పెద్ద‌ప‌ల్లి, క‌రీంన‌గ‌ర్, కొత్త‌గూడెం, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్, హ‌నుమ‌కొండ జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

Read Also : REAL HERO Subhan Khan : సుభాన్ ఖాన్ ను సన్మానించిన అసదుద్దీన్ ఒవైసీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Rain Alert
  • Heavy Rainfall Alert
  • IMD Issues
  • telangana rains

Related News

Alert for the people of the Telugu states: Heavy rain forecast.

Weather Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. భారీ వర్ష సూచనా

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చినా, అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిశాయి.. అయితే, నేటి నుంచి వాతావరణం పూర్తిగా చల్లబడనుందని, ఇరు రాష్ట్రాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలోని ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలపై వర్షాల ప్రభావం ఎక్కువ

  • Cm Revanth Reddy: వర్షం వస్తే నేనే రోడ్డు మీదికి వస్తా.. అధికారులపై సీఎం రేవంత్ సీరియస్

Latest News

  • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  • Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

  • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

  • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

  • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd