Posani : బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణం – పోసాని కన్నీరు
Posani : ఇప్పటికే ఆయనపై నాలుగు కేసుల్లో బెయిల్ లభించినా, సీఐడీ నమోదు చేసిన మరో కేసులో గుంటూరు కోర్టు ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ విధించింది
- By Sudheer Published Date - 10:52 PM, Wed - 12 March 25

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani) మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో కర్నూలు నుండి గుంటూరుకు తరలించిన పోలీసుల, అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, అనంతరం న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. విచారణ సందర్భంగా పోసాని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. “నా ఆరోగ్యం బాగోలేదు, రెండు ఆపరేషన్లు జరిగాయి. తప్పు చేస్తే శిక్షించండి, కానీ వ్యక్తిగత కోపంతో నాపై కేసులు పెట్టి రాష్ట్రమంతా తిప్పుతున్నారు” అని వాపోయారు.
KTR : ‘చీప్’ మినిస్టర్ త్వరగా కోలుకోవాలంటూ సీఎం రేవంత్ పై కేటీఆర్ సెటైర్లు
తనకు తగిన న్యాయం జరగకపోతే ఆత్మహత్యే (Suicide) శరణ్యమని పోసాని వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. ఇప్పటికే ఆయనపై నాలుగు కేసుల్లో బెయిల్ లభించినా, సీఐడీ నమోదు చేసిన మరో కేసులో గుంటూరు కోర్టు ఈ నెల 26వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. పోసాని బెయిల్‌పై ఉన్నప్పటికీ, ఊహించని విధంగా మరో కేసులో జైలుకు వెళ్లాల్సి రావడం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Fee Reimbursement : దశలవారీగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తాం – మంత్రి లోకేష్
సోషల్ మీడియాలో పోసాని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కొందరు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు మద్దతు ప్రకటించగా, మరికొందరు మాత్రం ఆయన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు. పోసాని ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కోర్టు త్వరలో ఆయనకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ కేసు మళ్లీ ఏ మలుపు తిరుగుతుందో, పోసానికి తగిన న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి.