KTR : ‘చీప్’ మినిస్టర్ త్వరగా కోలుకోవాలంటూ సీఎం రేవంత్ పై కేటీఆర్ సెటైర్లు
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేస్తూ "చీప్ మినిస్టర్ త్వరగా కోలుకోవాలి" అంటూ విమర్శించారు
- By Sudheer Published Date - 09:51 PM, Wed - 12 March 25

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్(KCR)ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేస్తూ “చీప్ మినిస్టర్ త్వరగా కోలుకోవాలి” అంటూ విమర్శించారు. ఆయన మాటలు మానసిక స్థితిని ప్రతిబింబిస్తున్నాయని, కుటుంబ సభ్యులు ఆయన్ను మానసిక వైద్య సేవలకు తీసుకెళ్లాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేటీఆర్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Hardik Pandya: పాండ్యా అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ర్యాంకింగ్స్‌లో ఎందుకు వెనకపడిపోతున్నాడు?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి తన పదవికి తగిన విధంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని, మర్యాదా రాహిత్యంగా మాట్లాడటం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఇలాంటి నీచ రాజకీయాలను తెలంగాణ ప్రజలు సహించబోరని, సమయం వచ్చినప్పుడు సరైన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం గర్వించే నాయకులపై ఈ విధంగా అనవసరమైన విమర్శలు చేయడం అప్రజాస్వామికమని, ఇది రేవంత్ రెడ్డి రాజకీయ పరిపక్వత కోల్పోయిన సంకేతమని ఆమె విమర్శించారు.
Guava Leaves: ఈ ఆకును వారానికి 3 సార్లు నమలండి.. అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు!
మాజీ మంత్రి హరీశ్ రావు కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకుల మరణాన్ని కోరుకోవడం అత్యంత దిగజారుడుపద్ధతి అని, సీఎం పదవి దక్కిందని కావాలనే ఇష్టానుసారంగా మాట్లాడటం సమంజసం కాదని అన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రతిపక్ష నేతలను కించపరచడం, వారి ఆరోగ్యంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అధికారంలో ఉన్న నేతలకు తగదని హరీశ్ రావు మండిపడ్డారు. ఈ పరిస్థితులు చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్పే రోజు దగ్గర్లో ఉందని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు.
This mad dog has crossed every single limit of decency
I request his family members to take him to some mental health facility at the earliest or else in his frustrated state, he might start biting everyone around
Get well soon #CheapMinister https://t.co/pL24i5dWxd
— KTR (@KTRBRS) March 12, 2025