HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Iam Ready To Shed My Blood For Ippatam Village Janasena Chief Pawan Kalyan

Pawan Kalyan visit Ippatam: ‘ఇప్పటం’ కోసం రక్తం చిందించడానికైనా సిద్ధం!

జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే ఇప్పటం గ్రామంపై రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి కూల్చివేతలు మొదలుపెట్టింది... ఈ గ్రామ ప్రజల కోసం

  • Author : Balu J Date : 05-11-2022 - 12:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan
Pawan

జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే ఇప్పటం గ్రామంపై రాష్ట్ర ప్రభుత్వం కక్షగట్టి కూల్చివేతలు మొదలుపెట్టింది, ఈ గ్రామ ప్రజల కోసం నేను రక్తం చిందించడానికైనా సిద్ధంగా ఉన్నాను అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శనివారం ఉదయం ఇప్పటం గ్రామంలోని కూల్చివేసిన ఇళ్లను పరిశీలించి బాధిత ప్రజలతో మాట్లాడాలని మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ గారిని కార్యాలయం గేటు దగ్గరే ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటం వెళ్లడానికి అనుమతించబోమని పోలీసులు హుకుం జారీ చేశారు. కాలినడకన వెళ్తానని పవన్ కళ్యాణ్ వాహనం దిగి నడక ప్రారంభించారు.

ఆయనను పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో అనుసరించారు. పోలీసు సోదరులు అడ్డుకొన్నా మౌనంగా చేతులు కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తూ నడవాలని శ్రేణులకు సూచించారు. పోలీసుల కష్టాలు తనకు తెలుసు అన్నారు. కొంత దూరం తరవాత నడిచిన తరవాత పోలీసులు ఇప్పటం వెళ్ళేందుకు అనుమతించారు. పోరాట స్ఫూర్తికీ… ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమనే భావన కలిగించే మిలిటరీ జర్కిన్ తో పవన్ కళ్యాణ్ ఇప్పటం బయలుదేరటం విశేషం.

Also Read:  Janasena : జనసేనాని హ‌త్య కుట్ర తూచ్‌! తేల్చేసిన పోలీస్!!

ఇప్పటం చేరుకున్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ కాలి నడకన పర్యటించి కూల్చివేసిన ఇళ్లను పరిశీలించి బాధిత ప్రజలతో మాట్లాడారు. వారు కన్నీటి పర్యంతమవుతూ తమ ఆవేదన వెలిబుచ్చారు. ఇండ్ల లక్ష్మి అనే మహిళ ఆవేదన విని కళ్యాణ్ చలించిపోయారు. ‘మా ఇంట్లో నిండు గర్భిణీ ఉంది. కూల్చవద్దని అధికారుల కాళ్ళు పట్టుకున్నా. అయినా కనికరించలేదు. నీటి ట్యాంక్ కూడా కూల్చివేశారు. ఆ శబ్దాలకు భయపడిపోయాం. గర్భిణీ పరిస్థితి ఏమిటి? ఎవరికి మా బాధలు చెప్పుకోవాలి’ అని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. రైతులు, మహిళలు తమను పాలక పక్షం ఏ విధం వేధిస్తుందో తెలిపారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికీ ధైర్యం చెప్పి… ఈ గ్రామ ప్రజలకు జనసేన పార్టీ అండగా ఉంటుంది అన్నారు. ఎంత మాత్రం వెనకడుగు వేసేది లేదు.. ఎన్‌కౌంటర్ అన్నా భయపడం… ఇక అరెస్టులంటే తగ్గుతామా? అన్నారు. “జనసేన సభకు స్థలం ఇచ్చారనే ఇప్పటం గ్రామంపై కక్షగట్టి కూల్చివేతలు మొదలుపెట్టారు. కూల్చివేతలతో పాలన మొదలుపెట్టిన ప్రభుత్వం కచ్చితంగా కూలుతుంది. మార్చిలో మా సభకు భూమి ఇస్తే, ఏప్రిల్ లో ఇళ్లను కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారు .జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే కక్షతోనే ఇళ్లను కూల్చారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్కే ఇల్లు ఉన్న పెదకాకానిలో రహదారి విస్తరణ లేదా? కాకినాడ లేదా రాజమహేంద్రవరమా రోడ్లు వెడల్పు చేయడానికి. వైసీపీ నాయకులకు చెబుతున్నాం… ఇలాగే చేస్తే పులివెందులలో, ఇడుపులపాయలో మీ ఇళ్ల మీద నుంచి హైవే వేస్తాం. రోడ్లపై గుంతలు పూడ్చలేరు.. కానీ రోడ్ల విస్తరణ కోసం వైసీపీతోలేని ప్రజల ఇళ్లను కూల్చుతారు. గాంధీజీ, నెహ్రూ గారు, కలాం గారి విగ్రహాలు కూల్చేస్తారు. వైఎస్సార్ విగ్రహాన్ని మాత్రం అలాగే ఉంచుతారు.

Also Read:  Jogi Ramesh: ఆ రాయి చంద్రబాబు వేయించుకున్నదే…!!

ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డీ ఫ్యాక్టో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. జనసేన వారికి ఏం జరిగినా ఆయనదే బాధ్యత. కనీసం మాట్లాడనీయకుండా ఆపడానికి మీరెవరు? ప్రజలను ఇబ్బందులకు గురి చేసేలా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోంది. పోలీసు అధికారులు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. ఈ ప్రభుత్వానికి బుద్ధి ఉందా… మేమేమన్నా గూండాలమా? అత్యాచారాలు చేసిన వారిని పోలీసులు వదిలేస్తున్నారు. కూల్చివేస్తున్న వారికి పోలీసులు కొమ్ముకాస్తున్నారు. దోపిడీలు చేసేవారికి అండగా ఉంటున్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు చేసే పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు. అరెస్టులకు భయపడేది లేదు.. దేనికైనా సిద్ధమే. వైసీపీ వాళ్లకు చెబుతున్నా… మా మట్టిని కూల్చారు… మీ కూల్చివేత తథ్యం” అని పవన్ కళ్యాణ్ అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Jagan
  • ap politics
  • Ippatam
  • Pawan Kalyan
  • warning

Related News

Controversy at Mudragada Padmanabham's funeral... YCP objects to official honors.

Mudragada Padmanabham Funeral: ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం.. అధికారిక లాంఛనాలపై వైసీపీ అభ్యంతరం

ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో మరో వివాదం చోటు చేసుకుంది. కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలన్న ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను ఆయన కుటుంబ సభ్యులు తిరస్కరించారు. బతికున్నప్పుడు ఆయన్ను అనేక విధాలుగా అవమానించారని, ఇప్పుడు అధికారిక గౌరవాలు, సానుభూతి తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయా

  • Local elections in AP: Alliance aims for victory.

    AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై బిగ్ అప్డేట్

Latest News

  • Hyderabad : జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు.. !!

  • Wife Killed Husband : ఆరు నెలల్లో దేశంలో ఎంతమంది భార్యల చేతిలో భర్తలు చనిపోయారో తెలుసా ?

  • CJP ‘Chalo Parliament’ : రేపు CJP ‘ఛలో పార్లమెంట్’.. ఢిల్లీలో హైఅలర్ట్

  • UP : గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య!

  • J&K Cloudburst Tragedy: జమ్మూలో ప్రకృతి బీభత్సం.. 15 మందికిపైగా మృతి

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd