Anantapur Border : అనంతపురం బార్డర్‌లో వందలాదిగా పారా ట్రూపర్లు.. ఎందుకు?
కర్ణాటకలోని బళ్లారి నుంచి ఏపీలోని అనంతపురానికి(Anantapur Border) దాదాపు 100 కి.మీ దూరం ఉంటుంది.
- By Pasha Published Date - 07:16 PM, Thu - 27 March 25

Anantapur Border : అది ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక రాష్ట్రాల బార్డర్. అప్పటిదాకా ఆ సువిశాల మైదాన ప్రాంతమంతా కామ్‌గా ఉంది. ఈరోజు(గురువారం) ఉదయం అకస్మాత్తుగా అక్కడికి ఒక విమానం వచ్చింది. అది స్లో కాగానే.. అందులో నుంచి పెద్దసంఖ్యలో సైనికులు పారా చూట్లలో బయటికి రిలీజ్ అయ్యారు. వారంతా పారాచూట్లలో పక్షుల్లా తేలియాడుతూ, మెల్లమెల్లగా భూమి వైపుగా వచ్చారు. చివరకు భూమికి చేరువగా చేరగానే.. కాళ్లు పుడమికి ఆనించి పారచూట్‌ను బ్యాలెన్స్ చేస్తూ దిగిపోయారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. దాదాపు 280 మంది సైనికులు ఈవిధంగా పారచూట్లతో భూమిపై దిగారు. ఇంతకీ ఎందుకో తెలియాలంటే ఈవార్త మొత్తం చదవాల్సిందే.
Also Read :Railway Pass Rules: రైల్వే పాస్‌ల జారీ.. కొత్త రూల్ అమల్లోకి
పారా ట్రూపర్లు ఎవరు ? ఎలా పనిచేస్తారు ?
ముందుగా మనం పారా ట్రూపర్లు అంటే ఎవరో తెలుసుకుందాం.. పారచూట్ల సాయంతో యుద్ధ భూమిలోకి దిగే వారిని పారా ట్రూపర్లు అంటాం. వీరు ఎయిర్ ఫోర్స్‌లో భాగంగా పనిచేస్తారు. యుద్ధాలు వచ్చినప్పుడు, మిలిటరీ ఆపరేషన్లు చేయాల్సి వచ్చినప్పుడు.. వాయుసేన నుంచి ఆదేశాలు అందగానే విమానాల ద్వారా పారా ట్రూపర్లను యుద్ధ భూమిలో వదులుతారు. వారు పారచూట్లతో దిగిపోయి, శత్రువుల ఏరివేత ఆపరేషన్‌ను మొదలుపెడతారు. ఇందుకోసం తమతో పాటు ఆయుధాల కిట్‌ను, సహాయక సామగ్రిని తీసుకెళ్తారు. ఇది చాలా బరువే ఉంటుంది. దీన్ని మోస్తూ.. పారచూట్ సాయంతో నేలపైకి దిగడం అనేది పెద్ద టాస్కే. సైనికులు ప్రాణాలను ఫణంగా పెట్టి, దేశం కోసమే ఇదంతా చేస్తారు. అందుకే వాళ్లకు మనం హ్యాట్సాఫ్ చెప్పాలి.
Also Read :Earthquake: మధ్యప్రదేశ్‌లో భూకంపం.. పరుగులు తీసిన జనం!
అనంతపురం- కర్ణాటక బార్డర్‌లోనే ఎందుకు ?
కర్ణాటకలోని బళ్లారి నుంచి ఏపీలోని అనంతపురానికి(Anantapur Border) దాదాపు 100 కి.మీ దూరం ఉంటుంది. బళ్లారిలో భారత వాయుసేనకు వైమానిక స్థావరం ఉంది. అనంతపురం- కర్ణాటక సరిహద్దుల్లో వందల ఎకరాల్లో మైదాన భూములు ఉన్నాయి. అందుకే బళ్లారి ఎయిర్ బేస్ నుంచి ట్రైనీ సైనికులు పారా జంపింగ్‌లో శిక్షణ కోసం ఈ బార్డర్‌కు వస్తుంటారు. వారిని ప్రత్యేక విమానంలో తీసుకొచ్చి ఈ మైదానాలున్న ప్రాంతంలో బయటికి రిలీజ్ చేస్తారు. ఆ సైనికులంతా పారచూట్లతో మైదానాల్లో సేఫ్‌గా ల్యాండ్ అవుతారు. ప్రతి ఏడాది ఈవిధంగా సైనికులకు అనంతపురం- కర్ణాటక సరిహద్దుల్లో ట్రైనింగ్ ఇస్తుంటారు. సైనికులు పార షూట్ సాయంతో ల్యాండ్ అయిన వెంటనే, తమ పారషూట్లను మడతపెట్టి బ్యాగుల్లో పెట్టుకొని ప్రత్యేక వాహనాల్లో వైమానిక స్థావరానికి తిరిగి వెళ్లిపోతారు.