Pawan : మహిళలపై దాడులు అరికట్టడమెలా..? పవన్ సమాధానం ఇదే..!!
Pawan : పోలీసులు సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా పెట్టారు. మహిళలపై పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర సమాధానమిచ్చారు
- Author : Sudheer
Date : 10-11-2024 - 7:11 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీలో ప్రభుత్వం (AP NDA Govt) మారినప్పటికీ అత్యాచారాలు (Rape ) మాత్రం ఆగడం లేదు. కూటమి సర్కార్ వచ్చింది..ఇక దిగులు లేదని అంత భావించారు..కానీ గతంలో మాదిరే అత్యాచారాలు జరుగుతుండడం తో ప్రభుత్వం పై విమర్శలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం అత్యాచారాలు చేసే వారిపై, అలాగే సోషల్ మీడియా ద్వారా అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై కూడా నిఘా పెట్టాలని ఈ దారుణాలకు పాల్పడిన వ్యక్తులను ఎవర్ని వదిలిపెట్టకూడదంటూ హెచ్చరించారు.
ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం పబ్లిక్ గా పోలీసుల ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో పోలీసులు సోషల్ మీడియా పై ప్రత్యేక నిఘా పెట్టారు. మహిళలపై పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర సమాధానమిచ్చారు. మన కళ్ల ముందు ఏదైనా ఘటన జరుగుతున్నప్పుడు స్పందించాల్సిందిపోయి వీడియోలు తీయడం సమంజసం కాదని అన్నారు. పోలీసులు వచ్చే లోపు బాధితులకు సాయం చేయాలనే కనీస స్పృహ ఉండాలని హితవు పలికారు. ఈ వీడియోను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షేర్ చేస్తూ నాయకుడంటే ఇలానే ఉండాలని ప్రశంసిస్తున్నారు.
Read Also : Declaration of BC : బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ మోసం – KTR