Hindupur TDP : టీడీపీ ఖాతాలో హిందూపురం మున్సిపాలిటీ..?
బాలకృష్ణ నియోజకవర్గమైన హిందూపురం లో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు..టీడీపీ లో చేరారు
- By Sudheer Published Date - 08:05 AM, Fri - 16 August 24
ఏపీలో టీడీపీ (TDP) పార్టీకి పూర్తి స్థాయిలో పూర్వ వైభవం రాబోతుంది. గతంలో టీడీపీ వీడి వైసీపీ (YCP) లో చేరిన నేతలు , కార్యకర్తలు ఇలా అంత కూడా మళ్లీ సొంత గూటికి వస్తున్నారు. ఎన్నికల సమయంలో దాదాపు 90 % టీడీపీ శ్రేణులు తిరిగి సైకిల్ ఎక్కగా..ఇప్పుడు మిగతా 10 % కూడా సైకిల్ ఎక్కుతూ, వైసీపీ కార్యకర్తలు అంటూ లేకుండా చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కంచుకోటాలను సైతం టీడీపీ బద్దలు కొట్టగా..ఇప్పుడు చిన్న చితక వారిని సైతం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. తాజాగా బాలకృష్ణ (Balakrishna) నియోజకవర్గమైన హిందూపురం (Hindupur ) లో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు..టీడీపీ లో చేరారు. దీంతో రాబోయే మున్సిపాలిటీ (Hindupur Municipality) ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం పక్క అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
గురువారం మున్సిపల్ చైర్మన్ ఇంద్రజతో పాటు 9 మంది కౌన్సిలర్లు వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆధ్వర్యంలో వారంతా టీడీపీ కండువా కప్పుకున్నారు. దాంతో హిందూపురం మున్సిపాలిటీని త్వరలో టీడీపీ కైవసం చేసుకుందని అంత భావిస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం 38 వార్డులు ఉండగా 30 వార్డుల్లో వైసీపీ విజయం సాధించి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. టీడీపీ నుంచి 8 మంది కౌన్సిలర్లుగా గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇక ఇప్పుడు కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారు.
తాజాగా 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. టీడీపీ తరుపున గెలిచిన 8 మంది కౌన్సిలర్లు ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన 10మంది కలిపితే 18 మంది అయ్యారు. ఇంకొందరు వైసీపీ కౌన్సిలర్లు కూడా త్వరలో టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. చూద్దాం ఏంజరుగుతుందో..!!
Read Also : Kolkata Doctor Rape: ట్రైనీ డాక్టర్ హత్యకు వ్యతిరేకంగా బీజేపీ క్యాండిల్ మార్చ్
Related News
Mokshagnya : ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే కటౌట్లు, బ్యానర్లు, పాలాభిషేకాలు.. మోక్షజ్ఞ హవా..
ఒక్క సినిమా రిలీజ్ కాకుండానే స్టార్ హీరోకు చేసేంత హడావిడి మోక్షజ్ఞకు చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.