Chandrababu Angallu Case : అంగళ్ల కేసులో చంద్రబాబుకు భారీ ఊరట
అంగళ్లు కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే
- By Sudheer Published Date - 11:19 AM, Fri - 13 October 23

అంగళ్ల కేసు (Angallu Case)లో టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu)కు భారీ ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ (Bail ) మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ( AP High Court) తీర్పు చెప్పింది. లక్ష రూపాయల పూచీకత్తును సమర్పించాలని హైకోర్టు (Ap) షరతు విధించింది. అంగళ్లు కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది.
We’re now on WhatsApp. Click to Join.
అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యల తాలూకు ఆడియో, వీడియో క్లిప్పింగ్స్ గతంలోనే ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కోర్టుకు సమర్పించారు. చంద్ర బాబు రేచ్చగోట్టే వ్యాఖ్యల చేశాడని ఆరోపిస్తూ ఆయన ప్రసంగాన్ని పెన్ డ్రైవ్ ద్వారా కోర్టుకు అందజేశారు. ఇక రాజకీయ కుట్రలో భాగంగానే చంద్రబాబు మీద ఫిర్యాదును ఆలస్యంగా చేశారని బాబు తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరు వాదనలు విన్న కోర్ట్..ఈరోజుకు తీర్పు రిజర్వ్ చేసింది. ఈరోజు చంద్రబాబు కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో టీడీపీ నేతల్లో ఆనందం కనిపిస్తుంది. చిత్తూరు జిల్లా పర్యటనలో అంగళ్లుకు వెళ్లినప్పుడు అక్కడ జరిగిన ఘర్షణలో పోలీసులు గాయపడటంతో చంద్రబాబును మొదటి నిందితుడిగా చేర్చారు. అప్పటి నుంచి చంద్రబాబు ఈ కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో అరెస్టయిన టీడీపీ నేతలు కొందరు బెయిల్‌పై బయటకు వచ్చారు.
Read Also : MLC Kavitha: దశాబ్దాల పాటు ఏలిన కాంగ్రెస్, బీజేపీ అన్ని రంగాల్లో విఫలం: ఎమ్మెల్సీ కవిత