HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >High Tension Situation At Gudivada Small Psycho In Gudivada Chandrababu Naidu

Chandrababu: గుడివాడలో చిన్న సైకో.. ఇదేం ఖర్మలో చంద్రబాబు..!

తాడేపల్లి సైకో రాష్ట్రంలో చిన్న సైకోలను తయారు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. గుడివాడ (Gudivada)లో అర్ధరాత్రి వరకు జరిగిన 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి ప్రోగ్రాం జరిగింది.

  • Author : CS Rao Date : 14-04-2023 - 9:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CBN
Resizeimagesize (1280 X 720) (1)

తాడేపల్లి సైకో రాష్ట్రంలో చిన్న సైకోలను తయారు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. గుడివాడ (Gudivada)లో అర్ధరాత్రి వరకు జరిగిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి ప్రోగ్రాం జరిగింది. ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గుడివాడ ఎమ్యెల్యే కొడాలి నాని మీద విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ పుట్టిన గడ్డ నిమ్మకూరు, ఎమ్మెల్యేగా గెలిచిన సీటు గుడివాడ అన్నారు. యుగ పురుషుడు తిరిగిన గుడివాడలో నేడు గంజాయి మొక్క వచ్చింది అన్నారు. ప్రతి ఒక్కరు ఒక జెండా పట్టుకుని రోడ్డు మీదకు వస్తే ఈ బూతుల ఎమ్మెల్యే రోడ్డు మీదకు వస్తాడా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ ఎమ్మెల్యేకి రాజకీయ భిక్ష పెట్టింది టీడీపీనే. గాడి తప్పిన వీళ్లను చరిత్ర హీనులుగా నిలబెడతామన్నారు. ఎన్టీఆర్‌ గెలిచిన గుడివాడను పేకాట క్లబ్బులుగా మార్చారని.. క్యాసినోలు తెచ్చారు.. క్యాబరేలు చేయించారు అన్నారు. భూకబ్జాలు, ఇసుక మాఫియా, మట్టి మాఫియా.. అన్నీ అరాచకాలే అన్నారు. అభివృద్ధి పట్టదని.. నోరు విప్పితే బూతులే అన్నారు. అలాంటి వ్యక్తిని ఏం చేయాలో ప్రజలే తేల్చండి అన్నారు.

నిన్నటి వరకు తానే గెలుస్తా తెలుగు దేశం లేదు అని సీఎం అన్నారని.. ఆకాశంలో తిరుగుతున్న జగన్‌ను భూమి మీదకు దింపాలి అనుకున్నానన్నారు. పట్ట భద్రుల ఎన్నికల్లో అన్ని సీట్లూ టీడీపీనే గెలిచిందని.. ఈ ఎన్నికల ఫలితాలతో ఆకాశంలో ఉండే వ్యక్తి కిందకు చూడడం మొదలు పెట్టారన్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని ధరలు పెరిగాయి.. మద్యం సైతం నాసిరకంగా ఉందన్నారు. కిరాణా షాపులో కూడా ఆన్ లైన్ లావాదేవీలు తీసుకుంటున్నారు.. మరి మద్యం షాపుల్లో ఎందుకు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.

Also Read: Geetham University : గీతం యూనివ‌ర్సిటీ ద‌గ్గ‌ర మ‌రోసారి ఉద్రిక్త‌త‌.. అర్థ‌రాత్రి జేసీబీల‌తో వెళ్లిన అధికారులు

అమరావతి అందుకే

హైదరాబాద్ కంటే మెరుగైన నగరం కావాలని అమరావతిని మొదలు పెట్టానని.. కానీ మూడు రాజధానులు అని మూడు ముక్కలాట ఆడారన్నారు. కృష్ణా డెల్లాకునీరు తేవాలని నాడు 9 నెలల్లో పట్టిసీమ పూర్తి చేసిన నదుల అనుసంధానం చేశామన్నారు. భస్మాసురుడిని నమ్మి శివుడు వరం ఇచ్చినట్లు.. ప్రజలు జగన్‌ను నమ్మి ఓట్లు వేశారు.. నష్టపోయారన్నారు. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల అప్పు చేశారు.. ఒక్కొక్కరిపై రెండు లక్షల కోట్ల అప్పులు పెట్టారన్నారు. ఎన్నికల ముందు కేంద్ర మెడలు వంచుతాను అని చెప్పిన జగన్.. ఇప్పుడు మెడలు దించారన్నారు. జగన్ చెప్పిన ప్రత్యేక హోదా పోయింది.. పోలవరాన్ని ముంచేశారన్నారు.

అప్పుడు నన్ను నమ్మలేదు

2019 ఎన్నికల సమయంలోనే తాను నిజాలు చెప్పినా ఎవరూ నమ్మలేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో కోడికత్తి డ్రామా ఆడారని.. టీడీపీకి సంబంధం ఉందని ఆరోపణలు చేశారన్నారు. కోడికత్తి ఒక నాటకం అని తాను ఆనాడే చెప్పాను.. ఇప్పుడు ఎన్ఐఏ కూడా అదే తేల్చిందన్నారు. నిందితుడు శ్రీనివాస్‌ వైఎస్సార్‌సీపీ వ్యక్తే.. ఎన్నికల ముందు సానుభూతి కోసం ప్రశాంత్ కిషోర్ ఆడించిన డ్రామా అన్నారు. బాబాయి హత్యతో సానుభూతి పొందారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2004లో ఎన్నికల్లో అఫిడవిట్‌ ప్రకారం వైఎస్సార్‌ కుటుంబం ఆస్తి 1.7 కోట్లని.. ఇప్పుడు 29 రాష్ట్రాల సీఎంల ఆస్తి రూ. 505 కోట్లు అయితే.. ఒక్క ఏపీ సీఎం ఆస్తి అంతకన్నా ఎక్కువే ఉందన్నారు. టీవీలు, పేపర్లు, వ్యాపారాలు లేవనే నిరుపేద జగన్‌ ఏం చేసి రూ. 510 కోట్లు సంపాదించారో చెప్పాలన్నారు.

2 లక్షల కోట్లు దోపిడీ

గుడివాడలో జరిగిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో కలిసి పాల్గొన్నారు. మద్యం,ఇసుక, సహా అన్నింటిలో దోచుకున్నారని.. ఆయన అనుచరులు, వైఎస్సార్‌సీపీ నాయకులు మరో రెండు లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. జగన్ చెప్పినట్లు నవ రత్నాలు కాదు.. నవ మోసాలు. ఇసుక, మద్యం, గంజాయి, అప్పులు, కబ్జాలు, విద్వంసాలు, భూ మాఫియా అంటూ వైసీపీ పాలనపై దుయ్యబట్టారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • chandrababu naidu
  • gudivada
  • MLA Kodali Nani
  • tdp
  • ycp

Related News

Pemmasani Vs Ambati

Pemmasani Vs Ambati : వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ తో తంతే అమెరికాలో పడతావ్ జాగ్రత్త – పెమ్మసాని కి అంబటి కౌంటర్

ప్రస్తుత పరిణామాలు గమనిస్తుంటే ఏపీలో టీడీపీ-వైసీపీ మధ్య వైరం కేవలం విధానపరమైన విమర్శలకే పరిమితం కాకుండా, వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకుంది. కేంద్రమంత్రి స్థాయిలో ఉన్న పెమ్మసాని 'చంపేస్తాం' అనే అర్థం వచ్చేలా మాట్లాడటంపై వైసీపీ నేతలు మండిపడుతుండగా

  • Seat Increase In Lok Sabha

    Seat Increase in Lok Sabha & Assemblies : ఏపీలో నియోజకవర్గాలు పెరిగితే ఏ పార్టీ కి లాభం ?

  • Lokesh Rtd2

    Rural Development Trust: మాట ఇచ్చారు.. మడమ తిప్పకుండా నెరవేర్చారు దటీజ్ నారా లోకేష్

  • Ycp Mp 11

    YCP : పార్లమెంట్ భవనంలో కూడా వైసీపీ నేతలకు అదే నెంబర్ !!

  • Massive Fire Breaks Out On

    Amaravati : అమరావతిలో మరో భారీ అగ్ని ప్రమాదం..ఎవరి కుట్ర ఇది ?

Latest News

  • Hyderabad : రైడ్ బుక్ చేసిన మహిళకు దారుణమైన మెసేజ్ లు పంపిన ఉబెర్ డ్రైవర్

  • PURE EV : హైదరాబాద్ లో PURE EV అత్యాధునిక షోరూమ్ ప్రారంభం!

  • Road Accidents : ప్రమాదాల నివారణకు వైజాగ్ లో ‘డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్’ ప్రారంభం

  • Markapuram : ప్రియురాలితో ఏకాంతంగా గడుపుతుండగా కూతురు చూసిందని చంపేసిన తండ్రి

  • War Effect : లోన్లు తీసుకున్నవారికి షాకింగ్ న్యూస్ తెలిపిన రబీ

Trending News

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

    • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

    • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    • Beer Shortage: మందుబాబులకు షాక్.. వేసవిలో బీర్ల కొరత

    • Petrol ,Diesel Price Down : వాహనదారులకు గుడ్ న్యూస్.. పెట్రోల్ , డీజిల్ ధరలు తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd