CBN : అంగళ్లు ఘటన కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు
టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన అంగళ్లు ఘర్షణ కేసులో నేడు హైకోర్టులో తీర్పు రానుంది. ఈ కేసులో చంద్రబాబు
- By Prasad Published Date - 07:26 AM, Fri - 13 October 23

టీడీపీ అధినేత చంద్రబాబుపై నమోదైన అంగళ్లు ఘర్షణ కేసులో నేడు హైకోర్టులో తీర్పు రానుంది. ఈ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం నేడు తీర్పు వెల్లడించనుంది. బెయిల్ పిటిషన్ పై ఇరువైపులా వాదనలు విని తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. గత ఆగస్టు నెల 14వ తేదీన సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన చేపట్టారు. ఆ సమయంలో వైసీపీ – టీడీపీశ్రేణుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో చంద్రబాబు ఏ1గా పేర్కొంటూ మరో 179 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అనేక మంది టీడీపీ నేతలకు బెయిల్ మంజూరైంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై గురువారం సుధీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ వాదనలు ముగిసిన తర్వాత తీర్పును హైకోర్టు ఈ రోజు(శుక్రవారం)కి వాయిదా వేసింది. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్నారు.
Also Read: I Am With CBN : నేడు బ్లాక్ డ్రెస్‌లతో ఆఫీసులకు వెళ్లనున్న ఐటీ ఉద్యోగులు