TDP Office Attack Case : వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి షాక్ ఇచ్చిన హైకోర్టు
ఈ కేసులో వైసీపీ కీలక నేతలు , మాజీ మంత్రులు , ఎమ్మెల్సీ లు ఉండడంతో వారంతా ఈ కేసు నుండి బయటపడేందుకు ముందస్తు బెయిల్ కోసం కోర్ట్ లలో పిటిషన్ లు దాఖలు చేసే పనిలోపడ్డారు
- Author : Sudheer
Date : 09-07-2024 - 11:37 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి (YSRCP MLC Sri Lella Appi Reddy )కి ఏపీ హైకోర్టు (AP High Court) షాక్ ఇచ్చింది. గత వైసీపీ ప్రభుత్వ (Jagan Govt) హయంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం (TDP Office Attack) పై 2021, అక్టోబర్ 19న వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై అప్పట్లో జిల్లా పోలీసులు కేసు నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన టీడీపీ సర్కార్..ఆ కేసును బయటకు తీసి..నిందితులను అదుపులోకి తీసుకుంటుంది. ఈ కేసులో వైసీపీ కీలక నేతలు , మాజీ మంత్రులు , ఎమ్మెల్సీ లు ఉండడంతో వారంతా ఈ కేసు నుండి బయటపడేందుకు ముందస్తు బెయిల్ కోసం కోర్ట్ లలో పిటిషన్ లు దాఖలు చేసే పనిలోపడ్డారు. అందులో వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఒకరు.
We’re now on WhatsApp. Click to Join.
అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరుతూ ఈయన హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసారు. ఈయన చేసిన పిటిషన్ ఫై విచారణ చేసిన కోర్ట్.. పిటిషన్‌ను తోసిపుచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిడ్ వేసింది. ఇప్పటికే ఈ దాడి కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. దాడి వెనక ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా ఉన్నారని ఎఫ్ఐఆర్లో పోలీసులు పేరు చేర్చారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈయన చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 10కి వాయిదా వేసింది. మరోవైపు ఇప్పటికే e దాడి కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also : New Airline: దేశంలో మరో విమానయాన సంస్థ.. 2025 నాటికి ప్రారంభం..!