HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Heavy Rains Thunderstorm Alert In North Andhra Red Alert Issued

AP Thunderstorm: ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు, పిడుగుల ముప్పు – రెడ్ అలెర్ట్ జారీ

ఈ అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి శుక్రవారం నాటికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.

  • Author : Dinesh Akula Date : 23-09-2025 - 10:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Thunderstorm
Thunderstorm

విజయవాడ: (AP Thunderstorm)-  ఉత్తర ఒడిశా, వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వాతావరణం మారిపోతోంది. ఈ అల్పపీడనం సముద్ర మట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతోంది. గురువారం నాటికి తూర్పు మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో మరో కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

ఈ అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి శుక్రవారం నాటికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం సెప్టెంబరు 27న దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శుక్రవారం, శనివారాల్లో ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పిడుగులు, గాలివానలు కూడా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు పాటించాలని, మత్స్యకారులు గురువారం నుంచి ఆదివారం వరకు సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీవర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. గంటకు 40–50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది. చెట్ల కింద నిలబడకూడదని ప్రజలకు సూచించారు.

విపత్తు నిర్వహణ సంస్థ పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలకు రెడ్ అలెర్ట్, శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండాల ప్రభావం ఇంకా కొన్ని రోజులు రాష్ట్రంలో ఉండే అవకాశం ఉంది.

ఇక మరోవైపు వరదలు కూడా పెరుగుతున్నాయి. శ్రీశైలం జలాశయానికి భారీగా నీరు చేరుతోంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి వరద నీరు వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు 3,98,815 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 4,45,102 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడి గట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,167 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టు యొక్క 10 స్పిల్‌వే గేట్లను 14 అడుగుల ఎత్తు వరకు ఎత్తి 3,49,620 క్యూసెక్కులు నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.90 అడుగుల వద్ద ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 203.89 టీఎంసీలు నిల్వగా ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh rain alert
  • AP disaster management alert
  • AP thunderstorm alert
  • cyclone update Bay of Bengal
  • heavy rains Andhra Pradesh
  • North Andhra cyclone
  • red alert Andhra
  • Srikakulam weather
  • Srisailam flood status
  • Vizianagaram rain warning

Related News

Low-pressure area in the Bay of Bengal... extremely heavy rains in these states.

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

గత కొన్ని రోజులుగా దేశంలో అనేక ప్రాంతాల్లో వానలు తగ్గి ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. మందగించిన నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా మళ్లీ పుంజుకోనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఒక బలమైన వాతావరణ వ్యవస్థ (అల్పపీడన ద్రోణి) కారణంగా ఈ రుతుపవనాలు తిరిగి చురుగ్గా మారేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని శాస్త్రవేత

  • Low-pressure area in the Bay of Bengal... extremely heavy rains in these states.

    Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

  • Low-pressure area in the Bay of Bengal... extremely heavy rains in these states.

    Rain Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక..

Latest News

  • Liquor prices: మందుబాబులకు కిక్కు దిగే వార్త.. రాష్ట్రంలో పెరగనున్న మద్యం ధరలు

  • Nitin Gadkari: ఈ E20 ఇథనాల్ విధానాన్ని సమర్థించిన గడ్కరీ.. వినియోగదారులు అధిక ధరకు స్వచ్ఛమైన పెట్రోల్‌ను ఎంచుకోవచ్చని అన్నారు..

  • Ponnam Prabhakar: SIR ప్రక్రియ నత్తనడకన.. గడువు పొడిగించాలని పొన్నం విజ్ఞప్తి

  • Mudragada Padmanabham Funeral: ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో వివాదం.. అధికారిక లాంఛనాలపై వైసీపీ అభ్యంతరం

  • Samantha: ప్రెగ్నెన్సీ పై సమంత ఎమోషనల్ కామెంట్స్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd