Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీలో భారీ వర్షాలు
ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది...
- By Prasad Published Date - 09:28 AM, Mon - 19 September 22

ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడింది. ఇది ఈ నెల 20వ తేదీ నాటికల్లా అల్పపీడనం మారుతుందని వాతావరణ అధ్యయన కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తూర్పు గోదావరి, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, శ్రీకాకుళం.. వానలు దంచి కొట్టే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. తీరం వెంబడి భారీ గాలులు వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్ర తీర ప్రాంతాల్లో గంటకు 50 కి.మీ. నుంచి 60 కి.మీ. వేగంతో గాలులు వీసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చేపల వేటకు ఈనెల 20వ తేదీ నుంచి 22 వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఇప్పటికే వెళ్లినవారు 19వ తేదీ సాయంకాలంలోపు ఒడ్డుకు చేరుకోవాలని సూచించారు. కాగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే.. తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది