AP: ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన..అప్రమత్తంగా ఉండాలంటున్న IMD..!!
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. గతకొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది.
- Author : hashtagu
Date : 27-09-2022 - 9:51 IST
Published By : Hashtagu Telugu Desk
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు ఏపీని అతలాకుతలం చేస్తున్నాయి. గతకొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. అయితే ఇప్పుడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5కిమీ వరకు విస్తరించి ఉంది. దీంతో మంగళవారం నుంచి మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోందని…అమరావతిలోని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రానున్న 3 రోజుల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు కోస్తాంధ్రలో పలుచోట్లు, రాయలసీమలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
కాగా ప్రజలు అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు చెబుతున్నారు. మత్స్య కారులు చేపల వేటకు వెళ్లకూడదంటూ అధికారులు సూచిస్తున్నారు. కాగా సోమవారం ఉదయం రాత్రి వరకు వైఎస్సార్ కడ జిల్లా సింహాద్రిపురంలో అత్యథికంగా 8.7 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదు అయ్యింది.