HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Has Fear Started In Jagan

Telangana Election Results : తెలంగాణ లో కాంగ్రెస్ గెలుపు..జగన్ లో భయం మొదలైందా..?

కాంగ్రెస్ విజయం తో ఏపీ సీఎం జగన్ కు భయం పట్టుకుందని ఇప్పుడు అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు

  • Author : Sudheer Date : 04-12-2023 - 10:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jagan Bhayam
Jagan Bhayam

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ (Revanth Reddy) సేన ఘన విజయం సాధించింది..ఎగ్జిట్ పోల్స్ ఏమైతే చెప్పాయో..అదే జరిగింది. 64 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. కాంగ్రెస్ విజయం తో ఏపీ సీఎం జగన్ కు భయం పట్టుకుందని ఇప్పుడు అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఏ రాష్ట్రంలో నైనా ప్రజలు మార్పు అనేది కోరుకుంటున్నారు. ఒకే పార్టీ కి మళ్లీ మళ్లీ అధికారం ఇచ్చేందుకు పెద్దగా ఇష్టపడడం లేదు. సదరు పార్టీ ఎంత అభివృద్ధి చేసిన కానీ మరో పార్టీకి ఛాన్స్ ఇవ్వాలనే చూస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో అదే జరిగింది. తాజాగా తెలంగాణ (Telangana) లో కూడా అదే జరిగింది. రెండుసార్లు కేసీఆర్ కు అధికారం ఇచ్చిన రాష్ట్ర ప్రజలు..మూడోసారి చిత్తూ చేసి ఇంటికి సాగనంపారు.

కాంగ్రెస్ గెలుపు తో ఏపీ అధికార పార్టీ వైసీపీ (YCP) కి భయం పట్టుకుంది. ప్రజలు తీర్పు మాత్రమే కాదు కాంగ్రెస్ గెలుపుకు సహకరించిన టీడీపీ (TDP) తో కూడా జగన్ లో భయం మొదలైందని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ కి బిఆర్ఎస్…బిఆర్ఎస్ కు వైసీపీ పరోక్షంగా ఒకరికారు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అలాగే బిఆర్ఎస్ కు వైసీపీ మద్దతు తెలిపింది. సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కు ప్రచారం చేసింది..బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాబోయే ఏపీ ఎలక్షన్స్ లో వైసీపీ కి మద్దతు తెలుపాలని భావించింది. కానీ ఇప్పుడు బిఆర్ఎస్ అడ్రెస్ లేకుండా పోవడం..కాంగ్రెస్ పార్టీ కి టీడీపీ మద్దతు తెలుపడం..ఎన్నికల విజయం లో టీడీపీ పాత్ర కూడా ఉండడం తో ఈ ఎఫెక్ట్ ఏపీ ఎన్నికల ఫై పడనుందని అర్ధం అవుతుంది. ఏపీ ఎన్నికల్లో పరోక్షంగా కాంగ్రెస్ ..టిడిపి కి సపోర్ట్ చేయబోతుంది. అలాగే జనసేన – టీడీపీ కలిసి ఉండడం తో జగన్ (CM Jagan) కు ఇంకాస్త భయం ఎక్కువ అవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఒక వేళ తెలంగాణలో బీఆర్ఎస్ మరోసారి విజయం సాధించినట్లయితే.. టీడీపీ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేవి. ఎందుంటే.. రాజకీయంగా కాకపోయినా ఆర్థిక పరంగా హైదరాబాద్ అత్యంత కీలకం. టీడీపీ నేతల వ్యాపారాలు అక్కడే ఉంటాయి. గత ఎన్నికల్లో టీడీపీ నేతల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. పార్టీ మరిపోవాలని.. లేదా పోటీ నుంచి వెనక్కి తగ్గాలని లేకపోతే ఆస్తుల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని బెదిరింపులు వచ్చాయన్న ప్రచారం జరిగింది. టీడీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలన్న లక్ష్యంతో బీఆర్ఎస్ వైసీపీకి సహకరించిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు అప్పట్లో హైదరాబాద్ నుంచి అందిన సహకారం వైసీపీకి అందదు. ఆ ప్లస్ పాయింట్ టీడీపీకి లభించే అవకాశం ఉంది. అదే సమయంలో రేవంత్ రెడ్డి సీఎం అయితే.. తమకు సాయం చేస్తారని టీడీపీ వర్గాలు అనుకునే అవకాశం ఉంది. నిజంగా చేస్తారా లేదా అన్నది చూడాలి.

ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమితో టీడీపీకి నైతిక బలం పెరిగిందనే చెప్పాలి. ఆ పార్టీ క్యాడర్ లో ఉత్సాహం కనిపిస్తోంది. దీనికి కారణం అంతో ఇంతో అభివృద్ధి చేసిన కేసీఆర్ పైనే ఇంత వ్యతిరేకత ఉంటే.. అసలు ఎలాంటి అభివృద్ధి చేయని.. అన్ని వర్గాలనూ ఇబ్బంది పెడుతున్న సీఎం జగన్ పై ఇంకెంత వ్యతిరేకత ఉండాలని టీడీపీ భావిస్తోంది. వచ్చే ఎన్నికలు వార్ వన్ సైడేనని అనుకుంటోంది. దక్షిణాది ప్రజలు ప్రభుత్వాలను కొనసాగించడానికి ఏ మాత్రం ఆసక్తిగా లేరని తెలంగాణ ఫలితం తో అర్థమైంది. ఇదే ఏపీలో రిపీట్ కాబోతుందని టీడీపీ నమ్మకం తో ఉంది. మరి ఏపీ ప్రజలు ఏంచేస్తారో చూడాలి. ఏది ఏమైనప్పటికి తెలంగాణ లో కాంగ్రెస్ రావడం..వైసీపీ కి నిద్ర పట్టకుండా చేస్తుంది.

Read Also : Pawan Kalyan: జనసేనపై నెట్టింట ట్రోలింగ్.. బర్రెలక్కతో పోల్చుతూ సెటైర్లు!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm jagan
  • congress
  • tdp
  • telangana election results

Related News

TDP

TDP vs YCP : డైవర్షన్ రాజకీయాల కోసం విగ్రహాల ధ్వంసం – మంత్రి అన‌గాని

నంద్యాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ధ్వంసం ఘటన వెనుక వైసీపీ కుట్ర ఉందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.మంగ‌ళ‌గిరి కేంద్ర‌కార్యాల‌యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,, విగ్రహాన్ని ధ్వంసం చేసిన జంబులయ్యకు వైసీపీతో సంబంధాలు ఉన్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. జంబులయ్య భార్యకు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన

  • Mynampalli Rohith

    Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

  • Revanth Speech

    CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • NRI TDP

    TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

Latest News

  • Cm Vijay: నా కడుపులో బిడ్డ చావుకు సీఎం విజయే కారణం: సంచలన ఆరోపణలు చేసిన నటి

  • CBN : డీఎస్సీ నుంచి విగ్రహాల ఘటనల వరకు వైసీపీ కుట్ర‌ల‌పై సీఎం ఫైర్

  • Bluetooth Name: కొంప ముంచిన బ్లూటూత్‌.. విమానం యూటర్న్‌.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • Nara Lokesh: విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు..! మంత్రి నారా లోకేష్

  • Ponnam prabhakar: పవన్‌ కల్యాణ్‌ క్షమాపణ చెప్పాకే సభ పెట్టుకోవాలి: మంత్రి పొన్నం ఆగ్రహం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd