HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Guinness World Record For Yoga Andhra

Yogandhra 2025 : యోగాంధ్రకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్

Yogandhra 2025 : గ్రామగ్రామాల్లో యువకులు యోగాను అనుసరిస్తున్నారని చెప్పారు. యోగాకు హద్దులు లేవని, యోగాకు వయస్సుతో పనిలేదని మోడీ పేర్కొన్నారు

  • Author : Sudheer Date : 21-06-2025 - 9:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Yoga Rk Beach
Yoga Rk Beach

విశాఖపట్నం నగరం మరోసారి చరిత్ర సృష్టించింది. ‘యోగాంధ్ర 2025’ (Yogandhra 2025)కార్యక్రమం దేశాన్ని గర్వపడేలా చేసింది. విశాఖ RK బీచ్‌లో జరిగిన ఈ భారీ యోగా కార్యక్రమానికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness World Record) గుర్తింపు లభించింది. ఇప్పటివరకు గుజరాత్‌లోని సూరత్ పట్టణం 1.5 లక్షల మందితో నిర్వహించిన యోగా కార్యక్రమం రికార్డుగా నిలిచినప్పటికీ, యోగాంధ్ర 2025 ఆ రికార్డును అధిగమించింది. ఏకంగా 3 లక్షల మందికి పైగా ప్రజలు పాల్గొనడం ద్వారా కొత్త రికార్డుని నెలకొల్పింది.

Telangana Yoga Day: గచ్చిబౌలిలో జూన్ 21న యోగా డే వేడుకలు, 5500 మందితో భారీ నిర్వహణ

ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు 26 కిలోమీటర్ల మేర బీచ్ ప్రాంతంను యోగాసనాల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేశారు. 45 నిమిషాలపాటు జరిగిన యోగా ప్రదర్శనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో పాటు రాష్ట్ర, కేంద్ర మంత్రులు, వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. వారందరూ ఒకే సమయంలో యోగాసనాలు చేయడం వలన ఈ ఘనత సాధ్యమైంది.

Liver : మీ లివర్ బాగుందా..? డేంజర్ లో ఉందా..? అనేది ఈ లక్షణం తో తెలిసిపోతుంది

ఈ రికార్డు ద్వారా తెలుగు రాష్ట్రాలకు మాత్రమే కాదు, భారతదేశానికే ఒక విశేషమైన గుర్తింపు లభించింది. యోగాను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కలిగించే ప్రయత్నంలో ఇది మరో ముందడుగు. ‘వన్ ఎర్త్ – వన్ హెల్త్’ అనే థీమ్‌పై జరిగిన ఈ కార్యక్రమం ద్వారా యోగా వల్ల కలిగే శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు ప్రపంచానికి చాటి చెప్పబడ్డాయి. యోగా ఉద్యమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఇది గొప్ప ప్రేరణగా మారనుంది.

ఇక మోడీ మాట్లాడుతూ..యోగా ద్వారా ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చని మోడీ తెలిపారు. యోగాదినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతిచ్చాయని గుర్తు చేశారు. 175 దేశాల్లో యోగా చేయడం సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. గ్రామగ్రామాల్లో యువకులు యోగాను అనుసరిస్తున్నారని చెప్పారు. యోగాకు హద్దులు లేవని, యోగాకు వయస్సుతో పనిలేదని మోడీ పేర్కొన్నారు. ప్రకృతి సౌందర్యానికి, ప్రగతికి విశాఖపట్నం చిరునామా అని, చంద్రబాబు, పవన్‌ యోగాంధ్ర నిర్వహణకు చొరవ చూపారని కొనియాడారు. నారా లోకేశ్​ కూడా యోగాంధ్ర కార్యక్రమం కోసం కృషి చేశారని అన్నారు. నెలన్నర రోజుల్లో యోగాంధ్రను విజయవంతం చేయడంలో లోకేశ్​ పాత్ర కీలకమైందన్న ప్రధాని, కొత్త కార్యక్రమాల రూపకల్పనలో లోకేశ్​ చొరవ ప్రశంసనీయమన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • Guinness World Record
  • modi
  • Pawan Kalyan
  • Vizag RK Beach
  • Yoga Day Celebrations
  • Yogandhra 2025

Related News

Jagan Pawan

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

గతంలో తమ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అంతకంటే ఎక్కువ విలాసాలకు పాల్పడుతున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే, దీనిపై కూటమి నేతలు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు

  • Pawan Kalyan's Convoy Meets

    Accident : పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

  • Janasena Pawan Kalyan

    Janasena : జనసేన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేవారే పార్టీకి కావాలి – పవన్

  • Janasena Pawan Kalyan

    మహా శివరాత్రి వేళ భక్తులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప శుభవార్త

Latest News

  • డార్క్ షవరింగ్ అంటే ఏమిటి? దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయా?!

  • హెరిటేజ్ నాణ్యతపై భరోసా.. YCP అసత్య ప్రచారానికి ఢిల్లీ హైకోర్టు చెక్!

  • ఐటీ శాఖ టార్గెట్ లిస్ట్‌లో ప్ర‌ముఖులు!

  • అవయవ దానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు?

  • ఈ ఏడాదిలో కారు కొన‌టానికి ఇదే మంచి స‌మ‌య‌మా?!

Trending News

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd