HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Government Employee Raped In Macherla

మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై అత్యాచారం

  • Author : Vamsi Chowdary Korata Date : 03-04-2026 - 11:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shocking Incident In Macherla
Shocking Incident In Macherla

Macherla పల్నాడు జిల్లా మాచర్లలో దారుణం జరిగింది. ప్రభుత్వ మహిళా ఉద్యోగిని కాళ్లు, చేతులు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. దాహమని చెప్పి మహిళను తాగేందుకు నీళ్లు అడిగి ఇంట్లోకి చొరబడ్డాడు. ఆమెను కత్తితో బెదిరించి కట్టేసి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత మహిళను గాయపరిచి అక్కడి నుంచి పారిపోయాడు. కొద్దిసేపటి తర్వాత ఈ ఘటన బయటపడగా.. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

పల్నాడు జిల్లా మాచర్లలో దారుణం జరిగింది. మాచర్లలో ఓ ప్రభుత్వ ఉద్యోగినిపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. తలుపు కొట్టి దాహమని నీళ్లు అడిగి కత్తితో బెదిరించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. సత్తెనపల్లికి చెందిన మహిళ మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఆమె పట్టణంలోని 13వ వార్డు రైల్వే స్టేషన్‌కి సమీపంలో ఏడాదిగా నివాసం ఉంటున్నారు. బాధితురాలు భర్తకు దూరంగా ఉంటున్నారు. ఆమె తన అక్క కుమారుడిని దత్తత తీసుకున్నారు. అయితే శుక్రవారం గుడ్‌ఫ్రైడే సెలవు దినం కావడంతో సత్తెనపల్లికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

గురువారం 50 ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి ఆమె ఇంటి డోర్ కొట్టాడు. దాహంగా ఉందని చెప్పి తాగడానికి నీళ్లు అడిగాడు. ఆమె నీళ్లు తీసుకొచ్చేందుకు ఇంట్లోకి వెళ్తుండగా అతడు కూడా ఇంట్లోకి వెళ్లాడు. తన వెంట తెచ్చిన కత్తిని ఆమె మెడపై పెట్టి బెదిరించాడు. ఆమె చేతుల్ని, కాళ్లను చున్నీతో కట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతడు బాధితురాలిని గాయపరచడంతో స్పృహ కోల్పోయింది. ఆమెకు ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో దత్తత కుమారుడికి అనుమానం వచ్చింది. వెంటనే తన స్నేహితుల్ని ఇంటికి పంపించాడు.

వారు ఇంటికి వచ్చి చూడగా ఈ దారుణం బయటపడింది. వెంటనే వారు పోలీసులకు సమాచారమిచ్చి వెంటనే బాధితురాలిని అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మహిళ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యుల సలహా మేరకు నరసరావుపేటలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మాచర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. అత్యాచార ఘటనపై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పందించారు. గుంటూరు రేంజ్ త్రిపాఠితో మాట్లాడారు. ఈ కేసులో నిందితుడ్ని త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరారు. బాధితురాలికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అయితే పోలీసులు ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Government Employee
  • Macherla
  • Palanadu district
  • sexually assaulted
  • Women Government Employees

Related News

Apsrtc

APSRTC ఉద్యోగుల నిరీక్షణకు తెర..వారి ఖాతాల్లోకి రూ. 75 కోట్లు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఈ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది

    Latest News

    • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

    • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

    • మీ టూత్ బ్రష్ ఎక్స్‌పైరీ డేట్ తెలుసుకోండిలా?

    • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

    • టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో భారీ మార్పులు!

    Trending News

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

      • ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ

      • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd