Tirumala: తిరుమల భక్తులకు శుభవార్త!
అంతేకాకుండా ఈ భవన సముదాయంలో కల్యాణకట్ట, భోజనశాలలు కూడా నిర్మించారు. కల్యాణకట్టలో ఒకేసారి 80 మంది తలనీలాలు సమర్పించుకోవచ్చు. భోజనశాలల్లో 1,400 మంది ఒకేసారి భోజనం చేయవచ్చు.
- By Dinesh Akula Published Date - 02:35 PM, Thu - 25 September 25

Tirumala: తిరుమల (Tirumala) కొండపై భక్తుల కోసం వెంకటాద్రి నిలయం పేరుతో ఒక అత్యాధునిక వసతి సముదాయం ప్రారంభమైంది. రూ.102 కోట్లతో నిర్మించిన ఈ భవనాన్ని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, ఆనం రామనారాయణరెడ్డి, అనగాని సత్యప్రసాద్, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. ఈ వసతి గృహంలో ఒకేసారి 4,000 మందికి ఉచితంగా బస చేసే అవకాశం ఉంది. ఇందులో 16 డార్మిటరీలు, 2400 లాకర్లు, 24 గంటల వేడి నీటి సదుపాయం ఉన్నాయి. గదులు ముందుగా బుక్ చేసుకోకపోయినా.. అక్కడికి వెళ్లి ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
ఉపరాష్ట్రపతి శ్రీ రాధాకృష్ణన్ గారితో కలిసి తిరుమలలో భక్తుల వసతి సౌకర్యం కోసం నూతనంగా నిర్మించిన పిలిగ్రిమ్స్ అమ్నెటీస్ కాంప్లెక్స్-5ను ప్రారంభించడం ఆనందంగా ఉంది. ఒకేసారి 4 వేల మందికి ఇందులో వసతి సౌకర్యం కల్పించే వీలుంది. తలనీలాలు సమర్పించే కళ్యాణకట్ట, రెండు అధునాతన భోజనశాలలు… https://t.co/0zHnBYFRIj
— N Chandrababu Naidu (@ncbn) September 25, 2025
Also Read: TS DGP: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడితే కఠిన చర్యలు
అంతేకాకుండా ఈ భవన సముదాయంలో కల్యాణకట్ట, భోజనశాలలు కూడా నిర్మించారు. కల్యాణకట్టలో ఒకేసారి 80 మంది తలనీలాలు సమర్పించుకోవచ్చు. భోజనశాలల్లో 1,400 మంది ఒకేసారి భోజనం చేయవచ్చు. ఇంకా తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం మలయప్ప స్వామి చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. హంసవాహనం, శేషవాహనంపై స్వామివారి వాహనసేవలు అద్భుతంగా సాగుతున్నాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు.