HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Give Me One Chance To Defeat Ysrc Pawan Kalyan

Pawan Kalyan: `ఒక్క ఛాన్స్`తో ఏపీ జాత‌కం.!

`ఒక్క‌ఛాన్స్` ఏపీ జాత‌కాన్ని మార్చేసింది. రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌శ్నార్థ‌కం చేసింది. ఆర్థిక ప‌రిస్థితిని ఛిన్నాభిన్నం చేసింది. 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా `ఒక్క ఛాన్స్` నినాదం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి బాగా ప‌నిచేసింది.

  • By CS Rao Published Date - 05:32 PM, Mon - 14 November 22
  • daily-hunt
Ka Paul Pawan Kalyan
Ka Paul Pawan Kalyan

`ఒక్క‌ఛాన్స్` ఏపీ జాత‌కాన్ని మార్చేసింది. రాజ‌ధాని అమ‌రావ‌తిని ప్ర‌శ్నార్థ‌కం చేసింది. ఆర్థిక ప‌రిస్థితిని ఛిన్నాభిన్నం చేసింది. 2019 ఎన్నిక‌ల సంద‌ర్భంగా `ఒక్క ఛాన్స్` నినాదం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి బాగా ప‌నిచేసింది. ఆయ‌న్ను సీఎం చేయ‌డానికి ఆ స్లోగ‌న్ క‌లిసొచ్చింది. అనూహ్యంగా 151 మంది ఎమ్మెల్యేల‌ను గెలిపించ‌డం ద్వారా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని సీఎం చేశారు. ఇప్పుడు ఇదే స్లోగ‌న్ ను జ‌న‌సేనాని ప‌వ‌న్ అందుకున్నారు. ఏపీ ప్ర‌జ‌లు ప‌వ‌న్ కు కూడా `ఒక్క ఛాన్స్` ఇచ్చే విశాల‌హృద‌యుల‌ని జ‌న‌సేన న‌మ్ముతోంది.

2024 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ఒక్క అవకాశం ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలను అభ్యర్థించారు. రాష్ట్రంలో జగనన్న హౌసింగ్ స్కీమ్ (జేహెచ్‌ఎస్)లో వైఎస్ఆర్‌సీ నేతలు ₹10,500 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆయ‌న ఆరోపించారు.జగనన్న ఇల్లు పెదలందిరి కన్నీళ్లు (జగనన్న ఇళ్లు – పేదల కన్నీళ్లు) పేరుతో జనసేన రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా ఆదివారం లేఅవుట్‌ను ఆయన సందర్శించారు. ఆ సంద‌ర్భంగా 2024 ఎన్నికల్లో జ‌న‌సేన‌కు ఒక్క అవకాశం ఇవ్వండని కోరారు.

Also Read:  Farm House Files: జ‌గ‌న్, మోడీ బంధానికి కేసీఆర్ పొగ‌

`ప్రజాస్వామ్యం, అవినీతి రహిత, నిజాయితీతో కూడిన పాలనను చూపుతాం. సంక్షేమ పథకాలను ఆపబోం. పేదల ప్రయోజనం కోసం కొన్ని అదనపు పథకాలను జోడిస్తాము. ప్రజాధనాన్ని వృధా చేయబోము. ప్రభుత్వ సొమ్ము మొత్తం ప్రజల కోసం ఖర్చు చేస్తాం.` అంటూ ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ప‌వ‌న్ స‌రికొత్త నినాదం అందుకున్నారు.

రాష్ట్రాన్ని అప్పుల భారీ నుంచి బ‌య‌ట‌ప‌డేసేందుకు `ఒక్క ఛాన్స్ ` ఇచ్చి చూడండ‌ని మ‌రో వైపు కేఏ పాల్ అభ్య‌ర్థిస్తున్నారు. ప్ర‌పంచ దేశాల నుంచి 8ల‌క్ష‌ల కోట్లు తీసుకొస్తాన‌ని ప్రామిస్ చేస్తున్నారు. అంతేకాదు, మిగిలిన లీడ‌ర్ల మాదిరిగా ప్ర‌జాధ‌నాన్ని దోచుకుండా విదేశీ విరాళాల‌ను సేక‌రించి ఆంధ్రాను అమెరికా చేస్తానంటూ ప్ర‌మాణం చేస్తున్నారు. అందుకే `ఒక్క ఛాన్స్` ఇవ్వండ‌ని కోరుతున్నారు. ఒక వేళ 2024 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ కు ఒక్క ఛాన్స్ ఇస్తే, ఆ త‌రువాత 2029 ఎన్నిక‌ల్లో కేఏ పాల్ ఛాన్స్ ఉంటుంద‌ని ప్ర‌జాశాంతి పార్టీ భావిస్తోంది.

Also Read:  CBN Media: చంద్ర‌బాబు సానుభూతి మీడియాకు స‌రైనోడు..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Janasena
  • ka paul
  • one chance
  • Pawan Kalyan

Related News

Pawan Gudem

Gudem Village Electrification : గిరిజనుల్లో వెలుగు నింపి..వారి హృదయాల్లో దేవుడైన పవన్ కళ్యాణ్

Gudem Village Electrification : భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు దాటినా, ఇంకా విద్యుత్ సౌకర్యం లేని మారుమూల గిరిజన గ్రామాలు దేశంలో ఉన్నాయి.

    Latest News

    • Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

    • Hyundai Venue : మార్కెట్లోకి హ్యుందాయ్ వెన్యూకి పోటీగా 5 కొత్త SUVలు

    • Maganti Gopinath Assets : మాగంటి గోపీనాథ్ ఆస్తుల పై ఆ ఇద్దరి కన్ను – బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

    • Ration Cards Alert: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

    • Drinking Water: ‎నీరు తాగిన వెంటనే మూత్ర విసర్జనకు వెళ్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

    Trending News

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd