Recording Dance in TDP Office: మదనపల్లె టీడీపీ ఆఫీసులో రికార్డ్ డ్యాన్స్!
టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్ పుట్టినరోజు సందర్భంగా మదనపల్లె నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన రికార్డింగ్ డ్యాన్స్‌లో
- By Balu J Published Date - 03:36 PM, Sun - 30 October 22

ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఈవెంట్స్ జరిగితే.. అక్కడ రికార్డులు డాన్స్ నిర్వహించడం సాధారణంగా మారింది. ఈ కల్చర్ పార్టీలకు సైతం పాకింది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు కూడా రికార్డ్ డాన్స్ లు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్ పుట్టినరోజు సందర్భంగా మదనపల్లె నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో జరిగిన రికార్డింగ్ డ్యాన్స్‌లో ఆ పార్టీ నేతలు, ఆయన మద్దతుదారులు డ్యాన్స్ చేశారు.
నిమ్మనపల్లి సర్కిల్, చిత్తూరు బస్టాండ్, బెంగళూరు బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకలు ప్రయాణికులకు అసౌకర్యం కలిగించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాయి. పుట్టినరోజు వేడుకల్లో రికార్డింగ్ డ్యాన్స్ చేయడం నగరంలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.