Ganta Srinivasa Rao : భీమిలి నుండి గంటా పోటీ..
అలాగే నరసాపురం టికెట్ ను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించగా, బీజేపీ నరసాపురం లోక్ సభ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మను ప్రకటించింది. దాంతో రఘురామకు ఈసారి ఎక్కడ టికెట్ దక్కలేదని తెలుస్తుంది
- Author : Sudheer
Date : 29-03-2024 - 3:37 IST
Published By : Hashtagu Telugu Desk
గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) కు టీడీపీ టికెట్ వస్తుందో రాదో..వస్తే ఎక్కడి స్థానం ఇస్తారో..అని నిన్నటి వరకు అంత మాట్లాడుకుంటున్నారు..ఈ మాటలకు తెరదించింది అధిష్టానం (TDP). భీమిలి (Bheemili) నుండి గంటా ను బరిలోకి దింపుతున్నట్లు తాజాగా విడుదల చేసిన జాబితాలో స్పష్టం చేసారు. ముందుగా గంటాను చీపురుపల్లి నుంచి బొత్స మీద పోటీ చేయించాలని చంద్రబాబు భావించారు.
We’re now on WhatsApp. Click to Join.
కానీ గంటా అందుకు ఒప్పుకోలేదు. భీమిలీలో పోటీ చేస్తానని చెప్పడం తో.. చివరకు బాబు అక్కడే ఛాన్స్ ఇచ్చారు. ఇక చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణపై పోటీకి ఏపీ టీడీపీ మాజీ అధ్యక్షుడు కళా వెంకట్రావును ఖరారు చేశారు. అలాగే నరసాపురం టికెట్ ను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించగా, బీజేపీ నరసాపురం లోక్ సభ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాసవర్మను ప్రకటించింది. దాంతో రఘురామ(Raghurama)కు ఈసారి ఎక్కడ టికెట్ దక్కలేదని తెలుస్తుంది. నరసాపురం కాకపోతే విజయనగరం లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అయినా అవకాశం ఇస్తుందేమోనని భావించారు కానీ ఈరోజు టీడీపీ విడుదల చేసిన జాబితాలో విజయనగరం లోక్ సభ స్థానం అభ్యర్థిగా కలిశెట్టి అప్పలనాయుడు పేరు ప్రకటించారు. దీన్ని బట్టి రఘురామ కు కూటమి షాక్ ఇచ్చినట్లు అయ్యింది. నెక్స్ట్ ఏంచేస్తాడు అనేది చూడాలి. ఇక పెండింగ్ లో ఉన్న ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో పాటు లోక్ సభ అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటించింది. ఆ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

Tdp Lok Asm
Read Also : IT Notice : కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చిన ఐటీ శాఖ