HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Free Admissions In Private Schools Andhra Pradesh Education Department Orders

Free Admissions : ఏపీ ప్రైవేటు స్కూళ్లలో ఫ్రీ అడ్మిషన్లు.. విద్యాశాఖ ఉత్తర్వులు

Free Admissions : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరంలో 1వ తరగతి ఉచిత ప్రవేశాలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

  • Author : Pasha Date : 18-02-2024 - 10:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Free Admissions
Free Admissions

Free Admissions : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరంలో 1వ తరగతి ఉచిత ప్రవేశాలకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం సెక్షన్‌ 12(1) (ఈ) ప్రకారం విద్యార్థులకు ఈ ఉచిత అడ్మిషన్లు కల్పించనున్నారు. అనాథలు, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్‌ కేటగిరీ విద్యార్థులు ఈ పథకానికి అర్హులు. అర్హులైన విద్యార్థులు తమ పేర్లను పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు అప్లై చేసుకోవచ్చు. ఏప్రిల్‌ 1న అడ్మిషన్లకు ఎంపికైన విద్యార్థుల మొదటి విడత జాబితాను విడుదల చేస్తారు. ఏప్రిల్‌ 15న రెండో విడత జాబితా రిలీజ్ అవుతుంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో 25 శాతం అడ్మిషన్లు కల్పించనున్నారు. ఎంపికైన పిల్లలకు ప్రభుత్వమే ఫీజులను చెల్లిస్తుంది. ఇందులో అనాథ పిల్లలు, హెచ్‌ఐవీ బాధితుల పిల్లలు, దివ్యాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బలహీన వర్గాల పిల్లలకు(Free Admissions) 6 శాతం సీట్లను కేటాయించాలని రాష్ట్ర సర్కారు ఆదేశించింది.

We’re now on WhatsApp. Click to Join

ఏపీ గిరిజన గురుకులాల్లో..

  • 7 గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 8వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది.
  • అర్హులైన గిరిజన బాలబాలికలు మార్చి 25 వరకు ఆన్‌లైన్‌‌లో అప్లై చేయొచ్చు. ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లను మార్చి 30న విడుదల చేస్తారు.
  • ఏప్రిల్ 7న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్ష, రిజర్వేషన్ల ఆధారంగా.. మే 5న మెరిట్ జాబితా విడుదలచేసి మే 20, 25 తేదీల్లో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ అందిస్తారు.
  • ఏపీలోని 31 గిరిజన సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతి రెగ్యులర్ ప్రవేశాలతో పాటు 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్‌లాగ్‌ సీట్ల భర్తీకి ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్‌ రిలీజ్ చేసింది. అర్హులైన బాలబాలికలు ఏప్రిల్‌ 10 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు.

Also Read :Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌పై క్రిమినల్ కేసు.. మార్చి 25న విచారణకు పిలుపు

బీసీ గురుకులాల్లో ప్రవేశాలు

విజయవాడలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకులాల సంస్థ నిర్వహించే 103 బీసీ బాలికల పాఠశాలలు, 14 బీసీ జూనియర్ కళాశాలల్లో 5వ తరగతి(ఇంగ్లిష్ మీడియం), ఇంటర్మీడియట్(ఇంగ్లిష్ మీడియం) మొదటిసంవత్సరంలో ప్రవేశాలకు ఫిబ్రవరి 15న నోటిఫికేషన్ రిలీజైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులు మార్చి 1 నుంచి 31 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. 5వ తరగతి ప్రవేశాలకు ఏప్రిల్ 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఇంటర్ ప్రవేశాలకు ఏప్రిల్ 13న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రవేశపరీక్ష ఉంటుంది. ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ (అనాథ/మత్స్యకార) ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Education Department
  • ap govt
  • Free Admissions
  • Free Admissions in Private Schools

Related News

INS Mahendragiri joins the Indian Navy.

INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో యుద్ధనౌకను ప్రారంభించారు. ప్రాజెక్ట్ 17A నీలగిరి-క్లాస్ ప్రోగ్రామ్ కింద ఆరవ నౌక అయిన, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ప్రారంభించడంతో భారత నౌకాదళం శనివారం తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో ఈ యుద్ధనౌకను ప్రారంభించారు

  • State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

    Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd