P4 Scheme : మార్పు కోసం..చంద్రన్న మమేకం
P4 Scheme : ఈ స్కీమ్ ద్వారా కేవలం ఆర్థిక సహాయం అందించడం కాకుండా, వ్యక్తుల జీవన శైలిలో సుస్పష్టమైన మార్పు తీసుకురావడమే లక్ష్యం
- By Sudheer Published Date - 01:48 PM, Tue - 15 April 25

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రవేశపెట్టిన P4 విధానం (P4 Scheme) సమాజంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న దృష్టితో రూపొందించబడింది. ఈ స్కీమ్ ద్వారా కేవలం ఆర్థిక సహాయం అందించడం కాకుండా, వ్యక్తుల జీవన శైలిలో సుస్పష్టమైన మార్పు తీసుకురావడమే లక్ష్యం. ఇందుకోసం చంద్రబాబు ఏ ప్రాంతానికి వెళ్లినా, అక్కడి ప్రజల జీవన పరిస్థితులను స్వయంగా పరిశీలించి, వారి సమస్యలపై అవగాహన పొందుతున్నారు. ఇది ప్రజలతో మమేకం అయ్యే విధానంగా మారింది.
Kalasha: కలశ పూజ ప్రాముఖ్యత ఏమిటి.. పూజలో మామిడి ఆకులు కొబ్బరికాయ ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?
ప్రజల ఖాతాల్లో డబ్బు వేయడమే మార్పుకు మార్గం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. పథకాలతో పాటు, వారి ఆదాయ మార్గాలను పెంపొందించే అవకాశాలు కల్పించాలి. ఉపాధిని మెరుగుపరిచే విధంగా శిక్షణలు ఇవ్వాలి. యువతను వ్యవసాయానికి, చిన్న వ్యాపారాలకు ఆకర్షించాలి. నైపుణ్యాల అభివృద్ధికి మద్దతు ఇవ్వాలి. దీనిద్వారా ఒక వ్యక్తి స్థిరమైన ఆదాయాన్ని సంపాదించగలుగుతాడు. ఇదే మార్గంలో P4 స్కీం అమలవుతోంది. ఇది పేదలను ఆర్థికంగా స్వావలంబులుగా మార్చే దిశగా తీసుకొచ్చే మార్గదర్శి విధానం.
పేదల జీవితాల్లో నేరుగా కలిసిపోయి వారి బాధలను చూసిన చంద్రబాబు, వ్యక్తిగతంగా సహాయం చేస్తున్నా, అది పబ్లిసిటీ కోసమే కాదు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకొని తగిన చర్యలు తీసుకోవడమే అసలైన ఆలోచన. ప్రజల్లో ఉండడం వల్లే వారి అవసరాలను బాగా అర్థం చేసుకోవచ్చని ఆయన భావన. గతంలో ప్రజల నుంచి కొంత దూరంగా ఉన్నాననే గమనించి, ఇప్పుడు ఆయన మరింత ప్రజలలోకి వెళ్లి వారి జీవన ప్రమాణాల్లో స్థిరమైన మార్పు తేవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇది అర్ధం చేసుకోక..కొంతమంది చంద్రబాబు పై విమర్శలు చేస్తున్నారు.