Fire Accident : ఏపీ సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం..ఏదైనా కుట్ర ఉందా..?
Fire Accident : ఈ స్థాయి కీలక నేతల కార్యాలయాలు ఉండే ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించడంతో, భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు ఏర్పడ్డాయి
- By Sudheer Published Date - 10:50 AM, Fri - 4 April 25

అమరావతి సచివాలయంలో శుక్రవారం ఉదయం రెండో బ్లాక్(second block of Amaravati Secretariat)లో అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. బ్యాటరీ స్టోరేజ్ ప్రాంతంలో మంటలు అంటుకోవడంతో అధికారులలో ఆందోళన నెలకొంది. SPF సిబ్బంది అగ్నిమాపక శాఖను వెంటనే సమాచారం ఇవ్వడంతో, ఫైర్ సేఫ్టీ సిబ్బంది తక్షణమే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం ప్రారంభమైన సమయములో కార్యాలయంలో ఎవ్వరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే ఆస్తికి భారీ నష్టం జరిగిందని సమాచారం.
PF Withdrawal Process: పీఎఫ్ ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్.. ఇకపై వాటి అవసరంలేదు!
ఈ అగ్నిప్రమాదం ప్రత్యేకంగా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, ఈ బ్లాక్‌లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan ), ఆర్థిక మంత్రి పయ్యావలి కేశవ్, హోంశాఖ మంత్రి అనిత, ఇతర మంత్రులు నారాయణ, కందుల దుర్గేశ్, నందెంద్ల మనోహర్ మరియు ఆనంద్ రామనారాయణ రెడ్డి లాంటి ప్రముఖుల కార్యాలయాలు ఉన్నాయి. ఈ స్థాయి కీలక నేతల కార్యాలయాలు ఉండే ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించడంతో, భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు ఏర్పడ్డాయి.
ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణమా లేక వేరే కారణాల వలన మంటలు చెలరేగాయా అనే కోణంలో విచారణ సాగుతోంది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని సంబంధిత శాఖలకు సూచనలిచ్చారు. సెక్యూరిటీ పరంగా అత్యంత కట్టుదిట్టమైన సచివాలయంలో ఈ విధంగా మంటలు చెలరేగడంపై ఉద్దేశపూర్వక కోణం కూడా పరిశీలనలో ఉందని భద్రతా సంస్థలు వెల్లడించాయి.