Fire Accident : జగన్ ప్లాన్ లో భాగమే ఈ అగ్ని ప్రమాదమా..?
Fire Accident : లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ఉదయం తన విచారణను ప్రారంభించగానే రాత్రి తాడేపల్లి ప్యాలెస్ బయట కాగితాలు, డైరీలు తగలబడ్డ ఘటన చర్చనీయాంశంగా మారింది
- By Sudheer Published Date - 11:56 AM, Thu - 6 February 25

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామంగా తాడేపల్లి అగ్ని ప్రమాదం (Tadepalli Fire Accident) మారింది. జగన్ (Jagan) ఇంటి ముందు అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం..కీలక పత్రాలు అందులో తగలబడిపోవడం ఇప్పుడు అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఇదే విషయాన్నీ టీడీపీ చెప్పకనే చెప్పింది. లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) ఉదయం తన విచారణను ప్రారంభించగానే రాత్రి తాడేపల్లి ప్యాలెస్ బయట కాగితాలు, డైరీలు తగలబడ్డ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ అగ్ని ప్రమాదానికి గల కారణాలపై టీడీపీ తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? లేక స్కాంపై ఆధారాలను తొలగించే కుట్రలో భాగమా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి.
తాడేపల్లిలో తగలబడిన డాక్యుమెంట్లు నిజంగా లిక్కర్ స్కాంకు సంబంధించినవేనా అనే అనుమానాలు టీడీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. “సిట్ తన విచారణను మరింత ముందుకు తీసుకెళ్లే సమయంలోనే డాక్యుమెంట్లు తగలబడడం.. ఇదంతా స్కాం నిందితుల పన్నాగమే” అని వారు ఆరోపిస్తున్నారు. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఘటనపై ఇప్పటివరకు అధికారికంగా ఏ సమాచారం విడుదల కాకపోవడం మరింత అనుమానాస్పదంగా మారింది. ఈ ఘటనపై అధికార వైసీపీ నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రాలేదు. రాజకీయ దృష్టితో చూసినప్పటికీ ఇది ఒక ప్రధానమైన పరిణామంగా మారింది. తాడేపల్లి అగ్ని ప్రమాద ఘటనపై మరింత స్పష్టత రావాలంటే సీసీటీవీ ఫుటేజీని ప్రభుత్వం విడుదల చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. నిన్న సాయంత్రం జరిగినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి ఫుటేజీ బయటికి రాకపోవడం అనుమానాస్పదమని, దీనికి సంబంధించి తక్షణమే వివరణ ఇవ్వాలని వారు కోరుతున్నారు. “తానే తగలబెట్టి ప్రభుత్వంపై బురద జగన్ చల్లుతున్నారని ” టీడీపి ఆరోపిస్తుంది.
సిట్టు పడింది – తగలబడింది..
ఉదయం లిక్కర్ స్కాంలో సిట్ పడింది. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది.
* ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటి ?
* సిట్ తన ఇంటి దాకా వస్తుందని, ముందే లిక్కర్ స్కాంకి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగల బెట్టారా ?
* నిన్న… pic.twitter.com/4C0vGqqFDu— Telugu Desam Party (@JaiTDP) February 6, 2025