Siddam : ‘సిద్ధం’ సభలో జగన్ పైకి దూసుకొచ్చిన వ్యక్తి..షాక్ లో నేతలు
- By Sudheer Published Date - 08:40 PM, Sat - 3 February 24

దెందులూరు(Denduluru )లో జరిగిన ‘సిద్ధం’ (Siddham Meeting) సభలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. జగన్ (CM Jagan) అభివాదం చేస్తుండగా..ఓ యువకుడు (YCP Fan) సీఎం పైకి దూసుకొచ్చాడు..ఒక్కసారిగా యువకుడు జగన్ వద్దకు రావడంతో సెక్యూర్టీ సిబ్బందితో పాటు నేతలు ఖంగారుకు గురయ్యారు.
మరికొద్ది రోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి 175 కు 175 సాధించాలని జగన్ (Jagan) పట్టుదలతో ఉన్నారు..ఇందుకోసం ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఓ పక్క అభ్యర్థులను ప్రకటిస్తూనే మరోపక్క ప్రచారం మొదలుపెట్టారు. సిద్ధం (Siddham ) పేరుతో వరుసగా భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈరోజు శనివారం దెందులూరులో సభ జరిగింది. దాదాపు 110 ఎకరాల్లో ఏర్పటు చేసిన ఈసభకు ప్రజలు పోటెత్తారు.
We’re now on WhatsApp. Click to Join.
కాగా ఈ సభ జరుగుతుండగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. సభలో వైసీపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం సీఎం జగన్ (CM jagan) ప్రజలకు అభివాదం చేస్తుండగా.. ఓ అభిమాని సెక్యూరిటీని దాటుకుంటూ జగన్ వైపు దూసుకొచ్చాడు. ఇది గమనించిన భద్రతా సిబ్బంది అతన్ని అడ్డుకునేందుకు యత్నించారు. అయితే, వారిని వారించిన జగన్.. సదరు అభిమానిని దగ్గరకు తీసుకుని.. అతని కోరిక మేరకు సెల్ఫీ దిగారు. అనంతరం భద్రతా సిబ్బంది అతన్ని కిందకు దించారు. ఈ ఘటన చూసిన వారంతా ‘ఇదీ జగనన్న అంటే’, ‘ప్రజలపై ఆయనకున్న అభిమానం అంటే ఇదే’, ‘సరిహద్దులు లేని అభిమానం’ అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తూ వీడియో ను షేర్ చేస్తున్నారు.
సరిహద్దులులేని అభిమానం🙏🏻♥️
His Love towards his cadre…♥️👏🏻#VoteForFan #Siddham#YSJaganAgain#AndhraPradesh pic.twitter.com/JFhuNCSkTO— YSR Congress Party (@YSRCParty) February 3, 2024
Read Also : Telangana Cabinet Meeting: రేపు కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు…