Kodali Nani Health : కొడాలి నాని ఆరోగ్యం పై కుటుంబ సభ్యుల కీలక ప్రకటన
Kodali Nani Health : కొడాలి నానిని కలిసేందుకు ఎవరూ రావొద్దని, ఎక్కువ మంది కలిస్తే ఇన్ఫెక్షన్ వస్తుందని, అది ఆరోగ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు
- By Sudheer Published Date - 08:01 AM, Wed - 28 May 25

మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి(Kodali Nani Health)పై అంత గత కొద్దీ రోజులుగా మాట్లాడుకుంటున్న విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతూ, ముంబైలో కీలక శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేత దుక్కిపాటి శశిభూషణ్ (Shashi Bhushan) కుటుంబ సభ్యుల తరఫున కీలక ప్రకటన చేశారు. కొడాలి నానిని కలిసేందుకు ఎవరూ రావొద్దని, ఎక్కువ మంది కలిస్తే ఇన్ఫెక్షన్ వస్తుందని, అది ఆరోగ్యానికి ప్రమాదకరమని పేర్కొన్నారు. అభిమానులు, కార్యకర్తలు కొడాలి నానిని కలవాలన్న ఉత్సాహాన్ని అర్ధం చేసుకున్నప్పటికీ, ప్రస్తుతం ఆయన్ను కలవడం మంచిదికాదని విజ్ఞప్తి చేశారు.
Rishabh Pant: ఐపీఎల్‌లో 7 సంవత్సరాల తర్వాత పంత్ సెంచరీ.. వీడియో వైరల్!
కొడాలి నాని ముంబైలో చికిత్స అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఇటీవల సన్నిహిత మిత్రుని కుమారుడి పెళ్లి రిసెప్షన్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యారన్న వార్త వెలుగులోకి రాగానే, ఆయన ఆరోగ్యం పట్ల అపోహలు తలెత్తాయి. చాలా రోజుల తర్వాత నాని ప్రజల్లో కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ, కోవిడ్ నేపథ్యంలో ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని తేలికగా తీసుకోకూడదని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. మరో రెండు నెలల్లో ఆయన పూర్తిగా కోలుకుని అందరికీ అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఇక కొడాలి నానిపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఆయన దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని అనుమానంతో భూ, జల, వాయు మార్గాల్లో నిఘా పెట్టాలని కేంద్రం ఆదేశించింది. కొడాలి నానిపై రైతు మోషే కేసు, వాలంటీర్లకు బెదిరింపులు, అవినీతికి సంబంధించిన కేసులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో సోషల్ మీడియాలో చేసిన అనుచిత వ్యాఖ్యలు, ఇసుక, భూ కబ్జా ఆరోపణలు, గుడివాడ మద్యం గోదాముపై కేసులు వంటి పలు కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుల్లో కొన్ని ఏడేళ్ల వరకు శిక్షను దింపే అవకాశముండటంతో ఆయనపై నిఘా మరింత బలపడింది.