Jogi Ramesh : జోగి రమేష్ కు కుటుంబ సభ్యులే షాక్ ఇచ్చారు..
ఇబ్రహింపట్నంలో ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ బామ్మర్థులే వైసీపీ కి రాం..రాం చెప్పి టీడీపీ పార్టీలో చేరారు
- By Sudheer Published Date - 11:23 AM, Fri - 19 April 24

ఏపీ (AP)లో అసలైన ఎన్నికల (Elections) సందడి మొదలైంది. నిన్నటి నుండి నామినేషన్ల పర్వం మొదలుకావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పండగా వాతావరణం నెలకొంది. అధికార పార్టీ – ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు , స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్లు వేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో అధిక పార్టీ వైసీపీ కి మాత్రం ఇంకా షాకులు తగులుతూనే ఉన్నాయి. మరికొద్ది రోజుల్లో పోలింగ్ జరగనుండగా..పార్టీని వరుసగా నేతలు వీడుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎంపీ లు , ఎమ్మెల్సీ లు , జడ్పీటీసీ , ఎంపీటీసీ , సర్పంచ్ లు ఇలా ఫై స్థాయి నేతల నుండి కింది స్థాయి లీడర్స్ వరకు వరుసగా రాజీనామాలు చేస్తూ టీడీపీ , జనసేన పార్టీలలో చేరుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా ఇక ఇప్పుడు వైసీపీ కీలక నేత కుటుంబ సభ్యులే పార్టీకి రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. ఇబ్రహింపట్నంలో ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ (Jogi Ramesh) బామ్మర్థులే వైసీపీ కి రాం..రాం చెప్పి టీడీపీ పార్టీలో చేరారు. ఈరోజు ఉదయం పామర్తి దుర్గాప్రసాద్ , పామర్తి దుర్గారావు, పామర్తి వెంకటేశ్వరరావు వైసీపీ కి నుండి బయటకు వచ్చి టీడీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. జోగు రమేష్ ఇంటి ముందునే సభాస్థలి ఏర్పాటు చేసి మరీ టీడీపీలోకి 40 మంది జోగిబంధువర్గం చేరింది . వారందరికీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ (TDP MLA Candidate Vasantha Krishna Prasad) టీడీపీ పార్టీ కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జోగి బంధువలే పార్టీ మారారంటే..రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవాలని టీడీపీ శ్రేణులు మాట్లాడుకుంటున్నారు.
Read Also : AP Elections Survey : ఇండియా టుడే Vs టైమ్స్ నౌ.. ఏపీ రాజకీయాల్లో చర్చ