HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Fact Check Tax On Upi Users For Transactions Above Rs 2000 No Find The Truth Here

Fact Check : రూ.2వేల కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలపై ట్యాక్స్ ? నిజం ఇదీ

ఒక X వినియోగదారుడు సోషల్ మీడియాలో.. “ఏప్రిల్ 1 నుంచి.. మీరు రూ. 2,000 కంటే ఎక్కువ మొత్తాన్ని Google Pay(Fact Check), ఫోన్ పే లేదా ఏదైనా ఇతర UPI ద్వారా బదిలీ చేస్తే 1.1 శాతం పన్ను విధిస్తారు.

  • By Pasha Published Date - 09:22 AM, Sun - 15 December 24
  • daily-hunt
Fact Check Upi Tax Shakti Collective Newsmeter

Fact Checked By news meter

క్లెయిమ్ :  2025 ఏప్రిల్ 1 నుంచి రూ. 2000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలపై 1.1 శాతం మేర  పన్ను విధిస్తారు.

వాస్తవం: ఈ ప్రచారం తప్పు. 1.1 శాతం  పన్ను అనేది కేవలం PPI వ్యాపార లావాదేవీలకు వర్తిస్తుంది. బ్యాంక్ టు బ్యాంక్ డబ్బు బదిలీలకు ఇది వర్తించదు.

Also Read :Billionaires Free Time : లీజర్ టైం దొరికితే.. ఈ బిలియనీర్లు ఏం చేస్తారో తెలుసా ?

సోషల్ మీడియా పోస్ట్‌లో ఏముంది ?

యూపీఐ లావాదేవీలు మనదేశంలో బాగా పెరుగుతున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు యూపీఐ లావాదేవీలు చేస్తున్నారు. ఈ పరిణామం మనదేశంలో పెరిగిన డిజిటల్ అక్షరాస్యతకు నిదర్శనం.  అయితే 2025 ఏప్రిల్ 1 నుంచి యూపీఐ లావాదేవీలపై 1.1 శాతం పన్ను విధిస్తారంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక X వినియోగదారుడు సోషల్ మీడియాలో.. “ఏప్రిల్ 1 నుంచి.. మీరు రూ. 2,000 కంటే ఎక్కువ మొత్తాన్ని Google Pay(Fact Check), ఫోన్ పే లేదా ఏదైనా ఇతర UPI ద్వారా బదిలీ చేస్తే 1.1 శాతం పన్ను విధిస్తారు. ఉదాహరణకు మీరు ఎవరికైనా రూ. 10,000 పంపితే రూ. 110 పన్నుగా తీసివేస్తారు’’ అని రాశారు.

Fact Check, Upi Tax, Tax On Upi, Upi, Shakti Collective, Newsmeter,

వాస్తవాలు ఇవీ..

  • సోషల్ మీడియా యూజర్ చేస్తున్న ప్రచారం తప్పు అని న్యూస్‌మీటర్ గుర్తించింది. రూ. 2,000కు పైబడిన పీపీఐ వ్యాపార లావాదేవీలపై మాత్రమే 1.1 శాతం పన్ను వర్తిస్తుంది. ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు (PPIలు) అంటే.. కస్టమర్లు వాలెట్‌లో డబ్బును నిల్వ చేయడానికి, లావాదేవీలను నిర్వహించడానికి అనుమతించే టూల్స్.
  • యూపీఐ లావాదేవీలపై పన్ను గురించి TV9 తెలుగు బులెటిన్‌ను కూడా సదరు ఎక్స్ యూజర్ షేర్  చేశాడు. వ్యాలెట్లు, కార్డులను ఉపయోగించి చేసే చెల్లింపులపై మాత్రమే 1.1 శాతం పన్ను వర్తిస్తుందని టీవీ9 బులెటిన్‌లో స్పష్టంగా ప్రస్తావించారు.
  • మేం కీవర్డ్ సెర్చ్ ద్వారా ఈ అంశంపై ‘ది హిందూ’ పబ్లిష్ చేసిన న్యూస్ రిపోర్టును తీశాం. దానిలోనూ ‘రూ.2,000 కంటే ఎక్కువ PPI వ్యాపార లావాదేవీలపై 2025 ఏప్రిల్ 1 నుంచి 1.1% ఛార్జీ’ అని  టైటిల్ పెట్టారు. ఈ వార్త 2023 మార్చి 30న పబ్లిష్ అయింది.
  • కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫాక్ట్ చెక్ ద్వారా 2023 మార్చి 29న షేర్ చేసిన ఒక పోస్ట్‌ను కూడా మేం గుర్తించాం. అది కూడా ఈ తరహా తప్పుడు ప్రచారాన్ని ఖండించింది.

.@IndiaToday claims that UPI transactions over Rs 2000 will be charged at 1.1%#PIBFactCheck
➡️There is no charge on normal UPI transactions.

➡️@NPCI_NPCI circular is about transactions using Prepaid Payment Instruments(PPI) like digital wallets. 99.9% transactions are not PPI pic.twitter.com/QeOgfwWJuj

— PIB Fact Check (@PIBFactCheck) March 29, 2023

Also Read :Weekly Horoscope : ఆ రాశుల వాళ్లకు అప్పులు తీరుతాయ్.. ఈరోజు నుంచి డిసెంబరు 21 వరకు వీక్లీ రాశిఫలాలు

  • 2024 ఆగస్ట్ 21న Fi Money యూపీఐ లావాదేవీలపై ప్రచురించిన నివేదిక ప్రకారం.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన NPCI సంస్థ పరిధిలో యూపీఐ లావాదేవీలు ఉంటాయి. ఎన్‌పీసీఐ ప్రకారం.. కేవలం PhonePe లేదా Paytm వాలెట్ల వంటి ప్రీపెయిడ్ వాలెట్ల ద్వారా చేసే చెల్లింపులకు మాత్రమే ఛార్జీలు వర్తిస్తాయి. బ్యాంకు నుంచి బ్యాంక్ బదిలీలకు ఛార్జీలు వర్తించవు. ప్రీ-పెయిడ్  వాలెట్‌కు డబ్బును జోడించడం కోసం రుసుమును వసూలు చేస్తారు.  ప్రీపెయిడ్ వాలెట్లతో ముడిపడిన లావాదేవీలు రూ.2వేలు దాటితే 1.1 శాతం పన్ను వర్తిస్తుంది. యూపీఐ లావాదేవీలకు ఈ ట్యాక్స్ వర్తించదు.

(ఈ న్యూస్ స్టోరీని ఒరిజినల్‌గా ‘న్యూస్ మీటర్’ వెబ్‌సైట్ ప్రచురించింది. ‘శక్తి కలెక్టివ్’‌లో భాగంగా దీన్ని ‘హ్యాష్ ట్యాగ్‌యూ తెలుగు’ రీపబ్లిష్ చేసింది) 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fact Check
  • newsmeter
  • Shakti Collective
  • Tax On UPI
  • UPI
  • UPI Tax

Related News

UPI Transactions

UPI : సరికొత్త రికార్డ్ సృష్టించిన UPI

UPI : ఆగస్టులో UPI ద్వారా 2 వేల కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. గత సంవత్సరం ఆగస్టుతో పోలిస్తే ఇది 34% వృద్ధిని సూచిస్తోంది, ఇది డిజిటల్ చెల్లింపుల పట్ల భారతీయుల ఆదరణ ఎంతగా పెరిగిందో స్పష్టం చేస్తుంది

    Latest News

    • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

    • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

    • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

    • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd