Neeraja Reddy : ఏపీలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే మృతి..
మాజీ ఎమ్మెల్యే(MLA), ప్రస్తుత భాజపా నేత నీరజా రెడ్డి(Neeraja Reddy) మృతి చెందారు.
- By News Desk Published Date - 08:48 PM, Sun - 16 April 23

ఏపీ(AP) రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కర్నూలు(Kurnool) జిల్లా ఆలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే(MLA), ప్రస్తుత భాజపా నేత నీరజా రెడ్డి(Neeraja Reddy) మృతి చెందారు. కర్నూలు నుంచి హైదరాబాద్(Hyderabad) వెళ్తుండగా జోగులాంబ గద్వాల్ జిల్లా బీచుపల్లి వద్ద సడెన్ గా కారు టైర్ పేలి బోల్తా కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన సిబ్బంది, స్థానికులు ఆమెను కర్నూలు లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ నీరజా రెడ్డి మరణించారు.
నీరజా రెడ్డి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం 2019లో YCP లో చేరినా కొన్నాళ్లకే రాజీనామా చేసి BJP లో చేరారు. ప్రస్తుతం ఆమె ఆలూరు బీజేపీ ఇన్‌ఛార్జ్ గా ఉన్నారు. నీరజా రెడ్డి మృతితో ఆలూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులు ఆమెకు సంతాపం ప్రకటిస్తున్నారు.
నీరజా రెడ్డి భర్త శేషిరెడ్డి కూడా గతంలో పత్తికొండ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఫ్యాక్షన్ గొడవల్లో ఆయన మరణించారు. నీరజారెడ్డికి ఒక కుమార్తె ఉండగా ఆమె అమెరికాలో ఉన్నారు. ఆమె వచ్చాకే అంతిమ కార్యక్రమాలు నిర్వహిస్తారని సమాచారం.
Also Read : Minister Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్‌కు తప్పిన పెను ప్రమాదం