Ex Minister Jawahar : దళితుడు బొంతు మహేంద్రది ఆత్మాహత్య కాదు.. హోంమంత్రి చేయించిన హత్య – మాజీ మంత్రి జవహర్
దళితుడు బొంత మహేంద్రది ఆత్మాహత్య కాదని.. హోంమంత్రి చేయించిన హత్యేనని మాజీ మంత్రి కెఎస్ జవహర్
- Author : Prasad
Date : 17-11-2023 - 8:35 IST
Published By : Hashtagu Telugu Desk
దళితుడు బొంత మహేంద్రది ఆత్మాహత్య కాదని.. హోంమంత్రి చేయించిన హత్యేనని మాజీ మంత్రి కెఎస్ జవహర్ ఆరోపించారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు అధికమయ్యాయన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని దుమ్మేరు గ్రామంలో బొంత మహేంద్ర అనే దళితుడు ఆత్మహత్య చేసుకున్నాడని.. ఈ కేసులో హోంమంత్రి తానేటి వనిత ను ఏ1 ముద్దాయిగా చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. హోంమంత్రి ఎవరెవరికి ఫోన్‌లు చేశారో.. ఎవరు ఒత్తిడి తెస్తే అతనిని అరెస్ట్ చేసి వేధించారు అనే నిజాలు సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. హోంమంత్రిని సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేసి విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో హోంమంత్రి అరాచాకాలు అధికమయ్యాయని.. దళిత యువకులు ఇబ్బందులు పెడుతున్నారని జవహర్ ఆరోపించారు.
We’re now on WhatsApp. Click to Join.
గతంలో దళిత యువకుడు చిన్నాను ఎలా ఇబ్బంది పెట్టారో అందరూ చూసారని.. చిన్నా ఉదంతం మొదలుకొని ఇప్పుడు మహేంద్ర ఆత్మహత్య వరకు పూర్తిగా హోంమంత్రి కనుసన్నల్లోనే జరిగాయన్నారు. హోంమంత్రి ప్రధాన అనుచరులు వలనే ఆత్మహత్య, దాడులు జరిగాయని.. దళితుడు బొంత మహేంద్రది ఆత్మాహత్య కాదు హోంమంత్రి చేయించిన హత్యేనని స్పష్టం చేశారు. హోంమంత్రి నుంచి పోలీస్ ఉన్నతాధికారులు, ఎస్ఐ భూషణం అందరూ కలిసి పన్నాగం పన్నితే అందులో ఎస్ఐను బలి చేసారని తెలిపారు. హోంమంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేసి ఈ కేసు యోక్క దర్యాప్తుకు సహకరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. బొంతు మహేంద్ర కుటుంబాన్ని అదుకొని వారికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించాలని.. దళిత డ్రైవర్ ను డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీపై కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.
Also Read: Telangana Elections 2023 : తెలంగాణలో 28వేల పోస్టల్ బ్యాలెట్లు.. ఆమోదించిన ఈసీ