JD Lakshminarayana: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు ప్రాణహాని
తనకు ప్రాణహాని ఉందని సీబీఐ మాజీ జేడీ, భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ విశాఖపట్నం సీపీకి ఫిర్యాదు చేశారు.
- By Gopichand Published Date - 04:07 PM, Fri - 26 April 24

JD Lakshminarayana: ఏపీలో ఎన్నికల సందడి నెలకొంది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో నిమగ్నమయ్యాయి. అధికార పార్టీ వైసీపీ ప్రచారం జోరు పెంచగా.. కూటమి అభ్యర్థులు కూడా వేగంగా ప్రచారం చేస్తున్నాయి. తాజాగా తనకు ప్రాణహాని ఉందని సీబీఐ మాజీ జేడీ, భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) విశాఖపట్నం సీపీకి ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు తనను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసిందని పేర్కొన్నారు. దీంతో తనకు రక్షణ కల్పించాలని కోరారు. గాలి జనార్ధన్ రెడ్డి అనుచరులు విశాఖలో సంచరిస్తున్నారని ఆయన అనుమానిస్తున్నట్టు సమాచారం.
ఇటీవల ప్రచారంలో రాజకీయ నాయకులపై దాడులు ఫ్యాషన్‌గా మారిపోయాయి. ఇటీవల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో జగన్‌కు పెను ప్రమాదం తప్పింది. నుదిటిపై గాయమై ప్రాణాలతో బయటపడ్డారు. ఇదే దాడిలో వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా స్వల్ప గాయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత మాజీ సీఎం చంద్రబాబు సభలో కూడా రాళ్ల దాడి కలకలం రేపింది. ఈ దాడిలో రాళ్లు చంద్రబాబుకు తగలకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ వెంటనే పవన్ కల్యాణ్ సభలో కూడా రాళ్ల దాడి కలకలం రేగింది.
We’re now on WhatsApp : Click to Join