Chandrababu Naidu: రోజుకో ఘోరం, ప్రతి చోటా ప్రభుత్వ టెర్రరిజం : జగన్ పై చంద్రబాబు ఫైర్!
ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వైపీసీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
- Author : Balu J
Date : 08-07-2023 - 1:46 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వైపీసీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ పాలన గాడి తప్పిందంటూ జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో పోలీసులు వైసీపీకి అనుబంధంగా మారిందని బాబు ఆరోపించారు. ఇటీవల జరిగిన ఉదంతాలను లెవనెత్తుతూ సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘‘బకాయిలు చెల్లించాలని కోరినందుకు ధర్మవరానికి చెందిన చేనేత వర్గ వస్త్ర వ్యాపారులపై విజయవాడలో వైసీపీ గూండాలు అమానుష దాడికి పాల్పడ్డారు…బాధితులను నగ్నంగా వీడియోలు తీసి వికృతానందం పొందారు. రోడ్డు వేయమని ఉపముఖ్యమంత్రిని అడిగిన పాపానికి చిత్తూరు జిల్లాలో దళిత వర్గానికి చెందిన కానిస్టేబుల్ పై కేసు పెట్టారు….. సస్పెండ్ చేశారు.
ప్రకాశం జిల్లాలో పింఛను డబ్బు అడిగిన వితంతు మహిళపై కేసు పెట్టారు. రోజుకో ఘోరం…ప్రతి చోటా ప్రభుత్వ టెర్రరిజం. ఇదీ రాష్ట్రంలో పరిస్థితి. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు శాఖను వైసీపీ అనుబంధ విభాగంగా మార్చిన దుస్థితే ఈ పరిస్థితికి కారణం. ఈ ప్రభుత్వానికి తమ పోకడలపై ప్రజలు ఏమనుకుంటారో అని లేదు…సమాజం గమనిస్తోందనీ లేదు. ఈ వైసీపీ ప్రభుత్వ పాపాలకు ప్రజలు తిరుగులేని గుణపాఠం చెప్పడం మాత్రం ఖాయం’’ అంటూ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు.
ఇక గడపగడపలో మంత్రి గుడివాడ అమర్నాథ్ కు నిరసన సెగ తగిలింది. గెలిచిన నాలుగేళ్లకు ఊరు గుర్తుకు వచ్చిందా అంటూ మంత్రిని మహిళలు కడిగిపారేశారు. మళ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసమే జనం కావాలా అని నిలదీశారు. అనకాపల్లి మండలం కొత్త తలారివానిపాలెంలో కాలువ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. శిలాఫలకం ఆవిష్కరిస్తున్న సమయంలో మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు. కొంతమంది మహిళలు మంత్రి దగ్గరకు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రహదారులు అధ్వానంగా ఉన్నాయని… డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: Delhi Metro: ఢిల్లీ మెట్రోలో అమ్మాయిల పోల్ డాన్స్.. చక్కర్లు కొడుతున్న వీడియో