Seediri Appalaraju: మంత్రి పదవి లేకపోయినా నేను మినిస్టర్ నే: అప్పలరాజు
Seediri Appalaraju) కు ఇవాళ ఏపీ సీఎంవో నుంచి పిలుపు వచ్చినట్టు కూడా వార్తలు వినిపించాయి.
- By Balu J Published Date - 05:53 PM, Fri - 31 March 23

ఏపీ సీఎం జగన్ క్యాబినెట్ విస్తరణ చేస్తారనే వార్తలు జోరుందుకున్నాయి. ఈ నేపథ్యంలో పలువురి మంత్రులకు ఉద్వాసన తప్పదనే ప్రచారం కూడా ఉంది. కాగా శుక్రవారం ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) కు ఏపీ సీఎంవో నుంచి పిలుపు వచ్చినట్టు కూడా వార్తలు వినిపించాయి. దీంతో మంత్రి అప్పలరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేబినెట్ లో ఉన్నా.. లేకపోయినా బాధ పడనని (Seediri Appalaraju) స్పష్టం చేశారు. తనకు ప్రజాసేవ ముఖ్యమని.. మంత్రి పదవి కాదని చెప్పారు. పదవి నుంచి తొలగిస్తారన్న దానిపై తనకు సమాచారం లేదని.. తన దృష్టిలో వైకాపా ఎమ్మెల్యేలందరూ మంత్రులేనని పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడిన సందర్భంగా పైవిధంగా రియాక్ట్ అయ్యారు అప్పలరాజు.