HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Enforcement Directorate Focus On Ap Raids Nri Hospital

NRI Hospital : ఎన్నారై ఆస్ప‌త్రికి రాజ‌కీయ గ్ర‌హణం! రంగంలోకి ఈడీ!

  • Author : CS Rao Date : 02-12-2022 - 5:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nri Hospital
Nri Hospital

ఏపీలో ఈడీ సోదాల‌ను మొద‌లు పెట్టింది. ఎన్నారై కాలేజి భాగోతాల‌ను బ‌య‌ట‌కు తీస్తోంది. ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ఎన్నారై ఆస్ప‌త్రి యాజ‌మాన్యం మారింది. అందుకు కార‌ణం వైసీపీ ప‌రోక్ష ప్ర‌మేయం ఉంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. యాజ‌మాన్యం మార్పు స‌మ‌యంలో ఆస్ప‌త్రి కేంద్రంగా గంద‌ర‌గోళం రేగింది. ఫైళ్ల‌ను తారుమారు చేయ‌డమే కాకుండా కొన్నింటిని గ‌ల్లంతు చేసిన వైనం కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఆ క్ర‌మంలో జ‌గ‌న్ స‌ర్కార్ లోని కొంద‌రు పెద్ద‌ల స‌హ‌కారంతో ఎన్నారై ఆస్ప‌త్రి కేంద్రంగా కొంత కాలం గంద‌ర‌గోళం నెల‌కొంద‌ని ఆస్ప‌త్రి వ‌ర్గాల్లోని టాక్‌.

ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లోని ఎన్నారై ఆస్ప‌త్రి అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ సీఎండీ మణిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ అధికారులు మణిని రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. విదేశీ పెట్టుబడులు, నిధుల మళ్లింపుపై ఈడీ ఆరా తీస్తోంది. ఎన్నారై, మేనేజ్ మెంట్ కోటాల్లో మెడికల్ సీట్లకు కోట్ల నిధులు వసూలు చేసినట్టు మణిపై ఈడీకి చేరింద‌ని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈడీ సోదాలు కొన‌సాగుతున్నాయ‌ని స‌మాచారం.

ఇప్పటికే ఈడీ అధికారులు ఆసుపత్రి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆసుపత్రిలోకి ఎవరినీ రానివ్వకుండా ఈడీ అధికారులు సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరించారు. విజయవాడలో అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ గత ఆగస్టులోనే ప్రారంభమైంది. ఎన్నారై ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్ గా కూడా మ‌ణి అక్కినేని ఉన్నారు. కొన్ని ప‌రిక‌రాలు ఎన్నారై నిధుల‌తో కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది. ఆ నిధుల విదేశాల నుంచి మళ్లించిన‌ట్టు తెలుస్తోంది. ఎన్నారై కమిటీ మరో సభ్యుడు నిమ్మగడ్డ ఉపేంద్ర ఇంటిపైనా కూడా దాడులు జ‌రుగుతున్నాయి. ఢిల్లీ నుంచి వ‌చ్చిన ప్ర‌త్యేక ఈడీ టీమ్ లు ఎన్నారై ఆస్ప‌త్రి లావాదేవీల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్నాయి. అంతిమంగా ఈడీ ఈ కేసును ఎటు వైపు తీసుకెళుతుందో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ed Raids
  • Enforcement Directorate (ED)
  • nri hospital
  • YS Jagan Mohan Reddy

Related News

Ambati Rambabu

అంబటి రాంబాబు అనే కుక్కకీ ఒక రోజొస్తుంది

Ambati Rambabu  వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతి కుక్కకూ ఒక రోజొస్తుంది. ఈ రాంబాబు అనే కుక్కకు కూడా ఓ రోజు వస్తుంది. అప్పుడు తగ్గనే తగ్గను’ అని ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఆయన, బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. అనం

  • Ap Legislative Council

    మండలిలో కొత్త రచ్చ.. దేవుడి చిత్రాలతో వైసీపీ రాజకీయం

Latest News

  • జింబాబ్వేపై టీమిండియా ఘ‌న‌విజ‌యం!

  • ఏ పండు తినడం వల్ల శరీరానికి అధిక ప్రోటీన్ ల‌భిస్తుందో తెలుసా?

  • భూభారతి పేరుతో.. కాంగ్రెస్ మార్క్ అవినీతి: మాజీ మంత్రి హరీష్ రావు

  • జింబాబ్వేపై భార‌త్ విధ్వంసం.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో రెండో అత్యధిక స్కోరు!

  • వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా సూప‌ర్ విక్ట‌రీ.. భార‌త్‌కు ఊర‌ట‌!

Trending News

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd