Chalo Vijayawada : సెప్టెంబర్ 1న ఛలో విజయవాడ…విజయవంతం చేయాలన్న ఉద్యోగ సంఘాలు..!!
ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల సాధనకు మరోసారి రెడీ అవుతున్నారు. CPSపై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్యలు విఫలమయ్యాయి.
- By hashtagu Published Date - 10:20 PM, Thu - 18 August 22
ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ల సాధనకు మరోసారి రెడీ అవుతున్నారు. CPSపై ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్యలు విఫలమయ్యాయి. చర్చలకు పిలిచిన సర్కార్ పాతపాటే పాడిందని ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1న నిర్వహించే ఛలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి.
CPSఎంత ప్రమాదకరమో GPSఅంతకంటే ప్రమాదమని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. GPS వద్దనే విషయాన్ని సంప్రదింపుల కమిటీకి తెలిపామన్నారు. CPSరద్దు చేసి OPSఅమలుచేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. సీపీఎస్ లో వచ్చిన సవరణను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు. హామీ ఇచ్చిన మేరకు ఓపీఎస్ పునరుద్ధరించాలనేదే తమ డిమాండ్ అన్నారు.