HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ecofix Instant Repair Of Roads Across The State

Ecofix : ఏపీలో ఇకపై వాహనదారులకు ఆ కష్టాలు ఉండవు ..!!

Ecofix : సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CRRI) అభివృద్ధి చేసిన ‘ఎకోఫిక్స్’ (Ecofix)అనే కొత్త సాంకేతికత ఈ సమస్యకు పరిష్కారం చూపుతోంది

  • Author : Sudheer Date : 05-08-2025 - 10:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ecofix Roads
Ecofix Roads

వర్షాకాలంలో రోడ్లపై గుంతలు ఏర్పడటం, వాటి మరమ్మతులు చేయడంలో జాప్యం జరగడం సాధారణ సమస్య. వర్షాలు తగ్గే వరకు వేచి ఉండాల్సిందేనని అధికారులు చెప్పేవారు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అయితే సెంట్రల్ రోడ్డు రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CRRI) అభివృద్ధి చేసిన ‘ఎకోఫిక్స్’ (Ecofix)అనే కొత్త సాంకేతికత ఈ సమస్యకు పరిష్కారం చూపుతోంది. ఈ వినూత్న మిశ్రమంతో వర్షంలోనూ రోడ్ల మరమ్మతులు చేయవచ్చు. దీని ద్వారా వర్షాకాలంలో గుంతలతో ఇబ్బందులు పడే పరిస్థితికి ఇకపై స్వస్తి చెప్పవచ్చు.

ఎకోఫిక్స్ మిశ్రమం తయారీకి స్టీల్‌స్టాగ్ అనే వ్యర్థ పదార్థాన్ని ఉపయోగిస్తారు. ఇది ఉక్కు పరిశ్రమల నుంచి లభిస్తుంది. ఈ వ్యర్థాన్ని కొన్ని రసాయనాలతో ప్రాసెస్ చేసి, 12 ఎంఎం కంటే చిన్న సైజులో ఉన్న కంకర, తారుతో కలిపి మోడిఫైడ్ బిటమిన్‌గా మారుస్తారు. ఈ ప్రత్యేక మిశ్రమాన్ని 30 కేజీల బస్తాల్లో నింపి సరఫరా చేస్తారు. రోడ్లపై గుంతలు ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని వెంటనే ఉపయోగించి మరమ్మతులు చేయవచ్చు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, గుంతల్లో నీరు నిండి ఉన్నా దాన్ని తొలగించకుండానే ఈ మిశ్రమాన్ని వేయడం సాధ్యమవుతుంది.

APSRTC : ఫ్రీ బస్ లలో సీసీ కెమెరాలు..?

ఎకోఫిక్స్ మిశ్రమంతో చేసే మరమ్మతులు సాధారణ పద్ధతులతో చేసిన వాటికంటే ఎక్కువ నాణ్యతగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది రోడ్లకు ఎక్కువ మన్నికను ఇస్తుంది. ఇప్పటికే గుజరాత్‌లోని సూరత్, ఢిల్లీ వంటి నగరాల్లో ఈ సాంకేతికతను విజయవంతంగా ఉపయోగించారు. దీని ఫలితాలు సానుకూలంగా ఉండటంతో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా దీనిని ప్రయోగాత్మకంగా పరీక్షించారు.

సోమవారం అమరావతిలోని మందడం వద్ద, విజయవాడలోని చిట్టినగర్ సొరంగం రోడ్డు వద్ద ఎకోఫిక్స్ మిశ్రమంతో రోడ్డు గుంతలను పూడ్చారు. మందడం వద్ద జరిగిన పనులను రాష్ట్ర ఆర్అండ్బీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ కొత్త సాంకేతికతను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తే వర్షాకాలంలో రోడ్డు గుంతల సమస్య చాలా వరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఇది ప్రయాణికులకు ఒక పెద్ద ఊరట అని చెప్పవచ్చు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap roads
  • CM Chandrababu
  • Ecofix
  • Repairing Potholes During Rainy Season

Related News

Kutami Govt

అన్నదాతకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కూటమి ప్రభుత్వం!

రైతుల ఆదాయం పెంచడమే కాకుండా వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది.

  • Iftar Ramadan

    Ramadan 2026 : ఏపీ ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

Latest News

  • ప్ర‌యాణికుల‌కు షాక్ ఇచ్చిన ఇండిగో.. భారీగా పెరిగిన ధ‌ర‌లు!

  • పెరుగు తినే సరైన పద్ధతి ఏమిటో తెలుసా?

  • ఐపీఎల్ 2026.. కేకేఆర్‌కు గట్టి ఎదురుదెబ్బ!

  • విద్యార్ధుల కోసం రూ.18 లక్షలతో రోడ్డు.. మంత్రి లోకేష్ మార్క్‌!

  • ‘Mega Farmers’ Fair 2026′ : తెలంగాణ వ్యవసాయానికి కొత్త కళ

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd